IPL 2025 SRH : మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ మార్చ్ 23న రాజస్థాన్ జట్టుతో ఆడనుంది. గత ఏడాది ఫైనల్ దాకా వెళ్లిన నేపథ్యంలో .. ఈసారి హైదరాబాద్ జట్టు కప్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.. గత సీజన్లో ఓడించిన కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ రెండు మ్యాచ్ లు ఆడనుంది.. గత సీజన్ లో ఓటమికి ఈసారి బదులు తీర్చుకోవాలని హైదరాబాద్ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : ఈసారి SRH ఐపీఎల్ షెడ్యూల్ ఎలా ఉందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయంటే..
బ్యాటింగ్ లో బలంగా..
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మను హైదరాబాద్ జట్టు మెగా వేలంలో రిటైన్ చేస్తుంది. ఆస్ట్రేలియా జాతీయ జట్టు సారధి కమిన్స్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. 2018 తర్వాత గత ఏడాది హైదరాబాద్ జట్టు ఫైనల్ దాకా వచ్చిందంటే దానికి కమిన్స్ నాయకత్వ ప్రతిభే కారణం. క్లాసెన్ స్పిన్ బౌలర్ల పై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. జట్టులో కీపింగ్ బాధ్యతను నెరవేర్చుతాడు. హెడ్ గత సీజన్లో తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ జట్టుకు మెరుపు ఆరంభాలు అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ బీభత్సమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. హైదరాబాద్ జట్టు సాధించిన విజయాలలో హెడ్ – అభిషేక్ శర్మ జోడి ముఖ్యపాత్ర పోషించింది.. ఇక ఈ ఏడాది జట్టులోకి ఇషాన్ కిషన్ వచ్చి చేరాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ అత్యంత బలంగా కనిపిస్తోంది.
బౌలింగ్ విభాగంలో..
బ్యాటింగ్ లో మాత్రమే కాదు బౌలింగ్ విభాగంలోనూ హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ హైదరాబాద్ జట్టులో చేరాడు. దీంతో ఆ జట్టు బౌలింగ్ బలం పెరిగింది.. అయితే మెగా వేలంలో బ్రెండన్ కార్సే ను కొనుగోలు చేసినప్పటికీ.. అతడు గాయం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో వియాన్ ముల్డర్ జట్టులోకి వచ్చాడు. రాహుల్ చాహర్, ఆడమ్ జంపా రాకతో స్పిన్ బౌలింగ్ వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇక బ్యాకప్ ఆటగాళ్ల విషయానికొస్తే కాస్త లోటుపాట్లు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే జట్టు సమతూకంగా అనిపిస్తోంది. గత సీజన్ లో మాదిరిగానే.. ఈసారి కూడా హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడితే మాత్రం తిరుగుండదు. గత ఏడాది రన్నరప్ తో సరి పెట్టుకున్న హైదరాబాద్.. ఈసారి విజేతగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.
ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఇదే..
కమిన్స్(కెప్టెన్), హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, కమిందు మెండిస్, ఇషాన్ కిషన్, జిశాన్ అన్సారి, మహమ్మద్ షమి, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, సిమరీత్ సింగ్, ఆడం జంపా, ఇషాన్ మలింగ, వియాన్ ముల్డర్, అధర్వ థైడే, సచిన్ బేబీ, అనికేత్ శర్మ, అభినవ్ మనోహర్.
Also Read : హైదరాబాదులో సన్ రైజర్స్ జట్టు ఆడే మ్యాచ్లు చూడాలని ఉందా.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..