https://oktelugu.com/

IPL 2025: ఐపీఎల్ లో ఈ రికార్డులు బద్దలు కొడితే వీరే టాప్..

IPL 2025 ఐపీఎల్ 18వ ఎడిషన్ మొదలైంది. తొలి మ్యాచ్ శనివారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Kolkata Eden gardens) వేదికగా జరిగింది. తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( KKR vs RCB) పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో విక్టరీ సొంతం చేసుకుంది.

Written By: , Updated On : March 23, 2025 / 10:16 AM IST
IPL 2025

IPL 2025

Follow us on

IPL 2025: ఐపీఎల్ (Indian premier league) అంటేనే దూకుడుకు పర్యాయపదం. వేగానికి సిసలైన ఉపమానం. ఐపీఎల్ లో ప్రతి ఏడాది అనేక రికార్డులు నమోదు అవుతుంటాయి. పాత రికార్డులు బద్దలవుతుంటాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి మొదలుపెడితే జస్ ప్రీత్ బుమ్రా(Jaspreet bumrah) వరకు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే వీరు కొత్త రికార్డులను సృష్టించడం.. పాత రికార్డులను బద్దలు కొట్టడం పెద్ద విషయం కాదు. కాకపోతే బుమ్రా గాయం వల్ల ఐపిఎల్ లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది.

Also Read: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీ.. గెలిచేది ఈ జట్టే..

ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారంటే..

ఆటగాడి పేరు: మహీంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)
జట్టు: చెన్నై సూపర్ కింగ్స్(Chennai super kings)
ప్లే రోల్: మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ (ex captain , wicketkeeper)

చెన్నై జట్టులో ధోని మరో 19 పరుగులు చేస్తే.. ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా(Suresh Raina) కొనసాగుతున్నాడు. సురేష్ రైనా 4,687 పరుగులతో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.

ఆటగాడి పేరు: జస్ ప్రీత్ బుమ్రా
జట్టు: ముంబై ఇండియన్స్
జట్టులో స్థానం: కీలక బౌలర్. టీమిండియాలోనే కాదు ముంబై ఇండియన్స్ జట్టులోను బుమ్రా కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. మరో ఆరు వికెట్లు కనుక పడగొడితే బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులో హైయెస్ట్ వికెట్ టేకర్ గా కొనసాగుతాడు. జాబితాలో లసిత్ మలింగ (170) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

రవీంద్ర జడేజా (Ravindra Jadeja)
ఆడుతున్న జట్టు: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings )
జట్టులో స్థానం: కీలకమైన స్పిన్ బౌలర్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలకమైన స్పిన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇతడు ఇంకో ఎనిమిది వికెట్లు పడగొడితే.. ఈ జట్టులో అత్యధిక వికెట్లు సాధించిన డ్వెన్ బ్రావో(Dwayne Bravo) (140 వికెట్లు) ను అధిగమిస్తాడు.

విరాట్ కోహ్లీ (Virat Kohli)
ఆడుతున్న జట్టు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal challengers Bengaluru)
జట్టులో స్థానం: కీలక బ్యాటర్.. ఈ సీజన్లో కోల్ కతా జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ఈ సీజన్లో గనుక మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. డేవిడ్ వార్నర్ (66) పేరు మీద ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమిస్తాడు.

ఆటగాడి పేరు: రోహిత్ శర్మ
ఆడుతున్న జట్టు: ముంబై ఇండియన్స్
జట్టులో స్థానం: కీలక ఆటగాడు, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.

రోహిత్ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అతడు ఒక ఫోర్ కొడితే 600 బౌండరీలు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో అతడు నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తాడు. కాదు రోహిత్ మరో 142 పరుగులు చేస్తే.. ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలుస్తాడు. ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (8004) మొదటి స్థానంలో, శిఖర్ ధావన్ (6769) రెండో స్థానంలో ఉన్నాడు.

వీరే కాకుండా..

మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టు కీపర్ గా 194 అవుట్ లలో కీలకపాత్ర పోషించాడు. ఇంకో ఆరుగురు ఆటగాళ్ల అవుట్లలో అతడు పాలుపంచుకుంటే ఆసంఖ్య 200 కు చేరుకుంటుంది. ఇప్పటికే ఈ జాబితాలో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. దినేష్ కార్తీక్ 182 అవుట్లు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్లో గనుక మరో 41 పరుగులు చేస్తే రవీంద్ర జడజ 3000 పరుగులు వంద వికెట్లు తీసిన ఆటగాడుగా నిలుస్తాడు. ఈ సీజన్ లో కనుక జడేజా ఐదు మ్యాచ్లు ఆడితే.. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన రెండవ ఆటగాడుగా ఉంటాడు. ఈ జాబితాలో ధోని (234), సురేష్ రైనా (176) రవీంద్ర జడేజా ముందు ఉన్నారు.. రవీంద్ర జడేజా మరో 10 మ్యాచ్లు ఆడితే.. ఐపీఎల్ లో 250 మ్యాచ్లు ఆడిన ఐదవ ఆటగాడిగా నిలుస్తాడు.

ఐపీఎల్ లో ఆరు మ్యాచులు ఆడితే.. అత్యధిక మ్యాచ్లో ఆడిన మూడవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. అంతేకాదు 257 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన బెంగళూరు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ను విరాట్ అధిగమిస్తాడు.

ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల తీసిన మూడవ బౌలర్ గా అవతరించడానికి భువనేశ్వర్ కుమార్ కు మరో మూడు వికెట్లు అవసరం. ఈ జాబితాలో 205 వికెట్లతో చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 192 వికెట్లతో పీయూష్ చావ్లా రెండో స్థానంలో ఉన్నాడు. 183 వికెట్లతో బ్రావో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.. సునీల్ నరైన్, రవిచంద్రన్ అశ్విన్ 180 వికెట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

 

Also Read: మొదటి రౌండ్‌లో అన్‌ సోల్డ్.. ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన రహానే