Ajinkya Rahane
Ajinkya Rahane: ఐపీఎల్ 18వ ఎడిషన్ లో భాగంగా శనివారం కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengalur) కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా (Kolkata Eden gardens) తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు(Royal challengers Bengaluru) జట్టు కెప్టెన్ రజత్ పాటిదర్ (Rajat Patidar) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది.. బెంగళూరు బౌలర్ జోష్ హేజిల్ వుడ్ తొలి ఓవర్ ఐదో బంతికే ప్రమాదకరమైన క్వింటన్ డికాక్ (4) ను అవుట్ చేశాడు. ఈ దశలో మరో ఓపెనర్ సునీల్ నరైన్(44), కెప్టెన్ రహనే ( 56) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 103 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత నరైన్, రహనే రెండు పరుగుల తేడాతో అవుట్ కావడంతో కోల్ కతా కాస్త ఇబ్బంది పడింది. ఈ దశలో వచ్చిన రఘు వంశీ (30) మాత్రమే పరవాలేదు అనిపించాడు. వెంకటేష్ అయ్యర్ (6), రింకూ సింగ్(12), రసెల్(4) విఫలమయ్యారు. దీంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను నష్టానికి 174 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో కృనాల్ పాండ్యా 3, హేజిల్ వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఆటగాడిగా రికార్డ్
వారెవా రహానే
ఇక ఈ మ్యాచ్లో ప్రధానంగా చెప్పాల్సింది రహానే గురించి.. కోల్ కతా జట్టుకు అనూహ్యంగా కెప్టెన్ అయిన అతడు.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. వాస్తవానికి అతడు గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలాడు. అయితే అతడిని రెండవ రౌండ్లో కోల్ కతా జట్టు యాజమాన్యం 1.5 కోట్లకు మాత్రమే కొనుగోలు చేసింది.. వాస్తవానికి మొదటి రౌండ్లో రహానే అమ్ముడుపోకపోవడంతో స్పోర్ట్స్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరిగింది. కానీ చివరికి కోల్ కతా జట్టు అతనిని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 18 వ ఎడిషన్లో రహానేకు అనుకుని వరం లాగా కోల్ కతా జట్టు పగ్గాలు దక్కాయి. పైగా తొలి మ్యాచ్లోనే రహానే తను ఏంటో నిరూపించుకున్నాడు.. హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఒకవేళ రహానే గనుక నిలబడి ఆడకపోయి ఉంటే కోల్ కతా స్కోరు మరింత దారుణంగా ఉండేది.. సునీల్ నరైన్, రహానే రెండో వికెట్ కు జోడించిన 103 పరుగుల భాగస్వామ్యం వల్లే కోల్ కతా ఆ స్థాయిలో స్కోర్ చేయగలిగింది. తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో సోషల్ మీడియాలో అజింక్య రహానే పేరు మార్మోగిపోతోంది.