Ajinkya Rahane (1)
Ajinkya Rahane: డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో మొదటి మ్యాచ్ ఆడిన కోల్ కతా నైట్ రైడర్స్.. ఆ జోరు కొనసాగించలేకపోయింది. కొత్త కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఆధ్వర్యంలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.. సొంత మైదానం, సొంత ప్రేక్షకులు, బలమైన బ్యాటింగ్, దుర్భేద్యమైన బౌలింగ్ ఉన్నప్పటికీ కోల్ కతా జట్టు బోణి సాధించలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది అనడం కంటే..కోల్ కతా నైట్ రైడర్స్ చేజేతులా ఓడిపోయిందని చెప్పడం సబబుగా ఉంటుంది. ముఖ్యంగా కోల్ కతా ఓటమికి కెప్టెన్ రహానే చేసిన తప్పిదాలే కారణమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
Also Read: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీ.. గెలిచేది ఈ జట్టే..
అలా ఎందుకు చేయలేదు..
ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా జట్టు టాస్ ఓడిపోయింది. తద్వారా ముందుగా బ్యాటింగ్ చేసింది. కోల్ కతా ప్లాట్ పిచ్ కావడంతో పరుగుల వరద ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది.. బెంగళూరు బౌలర్లు పక్కడ్బందీగా బంతులు వేయడంతో కోల్ కతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.. రహానే, సునీల్ నరైన్, రఘు వంశీ మినహా మిగతా వారంతా బ్యాట్లు ఎత్తేశారు. దీంతో కోల్ కతా జట్టు 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అదరగొట్టడంతో బెంగళూరు జట్టు 16 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. 175 పరుగులు పెద్ద టార్గెట్ అయినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో కోల్ కతా జట్టు విఫలమైంది. ముఖ్యంగా కెప్టెన్ రహనే ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. పవర్ ప్లే ఓవర్లలో నరైన్, హర్షిత్ రాణా సేవలను అతడు ఉపయోగించుకోలేదు. వారికి బౌలింగ్ ఇవ్వలేదు.
హర్షిత్ కు బదులుగా వైభవ్ ఆరోరాతో అతడు బౌలింగ్ వేయించడం విమర్శలుగా కారణమైంది. వైభవ్ బౌలింగ్లో సాల్ట్ విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత రహనే నష్ట నివారణ చర్యలకు దిగినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సునీల్ నరైన్ 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి.. 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.. ” అజింక్యా రహానే తప్పు చేశాడు. ముందుగానే హర్షిత్ రాణా, సునీల్ నరైన్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. వైభవ్ అరోరా తో బౌలింగ్ చేయించడం కోల్ కతా జట్టుకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాల్ట్, విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విరాట్ ను గతంలో సునీల్ నరైన్ నాలుగు సార్లు అవుట్ చేశాడు. కానీ ఈసారి అలా జరగలేదు. కెప్టెన్సీ గురించి.. వనరులను ఉపయోగించుకోవడం గురించి రహనే నేర్చుకోవాల్సి ఉందని” టీమిడియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారు పై వ్యాఖ్యలు చేశారు. ” వైట్ బాల్ ఫార్మాట్ విభినంగా ఉంటుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో రహానేకు తిరుగులేదు. కానీ ఇప్పుడు రహానే నాయకత్వం వహిస్తున్నది వైట్ బాల్ ఫార్మాట్ లో.. అలాంటప్పుడు అతడు నేర్చుకోవాలి. నాయకుడిగా మెరుగుపడాలని” రాబిన్ ఊతప్ప వ్యాఖ్యానించాడు.
Also Read: మొదటి రౌండ్‌లో అన్ సోల్డ్.. ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన రహానే