No Bag Day
No Bag Day: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు బ్యాగుల మోత తప్పేలా నో బ్యాక్ డే ను అమలు చేయనుంది. ఇప్పటికే ప్రతి నెలా మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేదికగా వెల్లడించారు. నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు క్విజ్, డిబేట్లు, సదస్సులు, క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చేసేందుకు నో బ్యాగ్ డే పక్కాగా అమలు చేయనున్నారు.
Also Read: విశాఖలో కూటమి దూకుడు.. అవిశ్వాస తీర్మానానికి సై!
* కొత్త విద్యా సంవత్సరం నుంచి..
జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం( new academic year) ప్రారంభం అవుతుంది. అప్పటినుంచి నో బ్యాగ్ డే ప్రారంభం కానుంది. బాల్యం బక్క చిక్కిపోతున్న తరుణంలో.. పుస్తకాల మోత నుంచి విద్యార్థులను తప్పించేందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
* ఇకనుంచి ప్రతి శనివారం..
ఇప్పటికే ప్రతి నెలలో మూడో శనివారం నో బ్యాగ్ డే( no bag day )అమలు చేస్తున్నారు. ఇకనుంచి ప్రతి శనివారం దానిని కొనసాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యా శక్తి పేరుతో ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆన్లైన్ బోధన సాగిస్తున్నారు. పాఠశాలల ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆన్లైన్ బోధన కొనసాగుతోంది. ఇలా వినూత్న కార్యక్రమాలతో విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం.