Homeక్రీడలుక్రికెట్‌IPL 2025 RCB VS PBKS Final : ఐపీఎల్ ఫైనల్ వేదికపై నుంచి గర్జించిన...

IPL 2025 RCB VS PBKS Final : ఐపీఎల్ ఫైనల్ వేదికపై నుంచి గర్జించిన వాయుసేన.. అదిరిపోయిన ఓపెనింగ్ సెర్మనీ

IPL 2025 RCB VS PBKS Final  : ఐపీఎల్‌ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య నేడు తుది పోరు జరగనుంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్‌లో నేడు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఓపెనింగ్ సెర్మనీని అదరగొట్టారు. ఈ ఓపెనింగ్ సెర్మనీని భారత సాయుధ దళాలు అహ్మదాబాద్ వేదికపై గర్జించాయి. భావోద్వేగంతో కూడిన సంగీతంతో వినిపించారు. క్రీడ తీవ్రతను త్యాగాల గౌరవంతో మిళితం చేసే రాత్రికి ఇది వేదికగా నిలుస్తున్నట్లు చూపించారు. ప్రతీ ఒక్కరిలో కూడా దేశభక్తిని రగిలించే విధంగా ఈ సెర్మనీ ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్‌లో పరాక్రమ చూపి దేశ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న భారత త్రివిధ దళాలకు బీసీసీఐ గౌరవ వందనం ఇచ్చింది. ఆ తర్వాత శంకర్ మహదేవన్ దేశ భక్తి గీతాలు, కళాకారుల నృత్యాలు అన్ని కూడా ఫ్యాన్స్‌ను అలరించాయి. అలాగే స్టేడియంలో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ఒక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు కూడా అర్పించారు. దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు కూడా చేశారు. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాలు ఆలపించడంతో పాటు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ వారిలో ఉత్సాహపరుస్తున్నారు.

Also Read : అయ్యర్.. ఈ పేరే ఓ బ్రాండ్.. ఐపీఎల్ ఆడటానికి కాదు.. ఏలేయడానికి వచ్చాడు!

ఆపరేషన్ సిందూర్‌ విజయాన్ని గ్రాండ్‌లో బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుగా దేశ భక్తి గీతాలను బాలీవుడ్ గాయకులు దేశభక్తి గీతాలను ఆలపించారు. పహల్గామ్ ఉగ్రవాద డాదిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడంతో పాటు స్టేడియంలోని పలు చోట్ల జాతీయ జెండాలను ఎగుర వేశారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు గుర్తుగా ముగింపు వేడుకలను సాయుధ బలగాలకు అంకితం చేశారు. ఐపీఎల్ ముగింపు వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా, ఇతర రంగాల నుంచి ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. అయితే ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా బీసీసీఐ చేసింది. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి వల్ల మ్యాచ్‌ మధ్యలోనే ఆపేయడం వల్ల గ్రాండ్‌గా సెర్మనీ నిర్వహించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular