Raja Saab Teaser : పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో ప్రభాస్ (Prabhas) మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన చాలా సినిమాల్లో తనకు గొప్ప గుర్తింపుని తీసుకురావడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేశాయి. బాహుబలి (Bahubali) సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నాడో అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతుండడం విశేషం… ఇక రీసెంట్ గా రాజాసాబ్ (Rajasab) సినిమా నుంచి ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. అందులో సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుంది అనే విషయాలను కూడా మొత్తానికైతే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దాంతో పాటుగా జూన్ 16వ తేదీన ఉదయం 10:52 నిమిషాలకు సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే రాజాసాబ్ సినిమా ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు…ఇక ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం గా కనిపించబోతున్నాడట… ఇప్పటివరకు ప్రభాస్ గోస్ట్ గా నటించలేదు.
Also Read : అక్షరాలా 90 కోట్లు..నైజాం లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పిన ‘ఓజీ’..’పుష్ప 2′ అవుట్!
ఇక ఈ సినిమాలో నటించి చంద్రముఖి (Chandramukhi) ని మించిన రేంజ్ లో ఇందులో భారీ ట్విస్ట్ లను ఆడ్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ప్రభాస్ దెయ్యం గా మారిన తర్వాత ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అనేది ఈ సినిమాలోని ప్రధాన కథాంశంగా సినిమా సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీజర్ లో సైతం ఎస్టాబ్లిష్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట…
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరి కంటే కూడా ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి…