IPL 2025 : వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయాన్ని మర్చిపోకముందే.. చెన్నై జట్టులోకి మరో టీనేజర్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెన్నై జట్టు తరఫున యువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఐపీఎల్ లోకి రంగ ప్రవేశం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భాగంగా చెన్నై ద్వారా ఆయుష్ మాత్రే ఐపీఎల్ లోకి తన పాదాన్ని మోపాడు. ఆయుష్ ఏజ్ 17 ఇయర్స్. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ వన్ డౌన్ ఆటగాడిగా మైదానంలోకి వచ్చాడు. అతడు 15 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. షేక్ రషీద్ తో కలిసి రెండో వికెట్ కు 41 పరుగులు జోడించాడు. అయితే దూకుడుగాడుతున్న ఆయుష్ దీపక్ చాహర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక అవుట్ కాకపోయి ఉంటే చెన్నై జట్టు స్కోరు వేరే విధంగా ఉండేది.. ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకునేది. కానీ అతడు అవుట్ కావడంతో ఒక్కసారిగా చెన్నై జట్టు పరిస్థితి తారు మారయింది. ఆయుష్ అవుట్ అయిన తర్వాత.. కొంతసేపటికి షేక్ రషీద్(19) కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే (53), రవీంద్ర జడేజా (50*) అదరగొట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన ఘనత..
అత్యంత చిన్న వయసున్న ఆటగాళ్లు వీరే.
ఐపీఎల్ లో అత్యంత చిన్న వయసున్న ఆటగాళ్ల జాబితాలో అభినవ్ ముకుంద్(18 సంవత్సరాల 139 రోజులు), అంకిత్ రాజ్ పుత్ (19 సంవత్సరాల 123 రోజులు), పతిరన (19 సంవత్సరాల 148 రోజులు), నూర్ అహ్మద్ (20 సంవత్సరాల 79 రోజులు) ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీ లో యంగెస్ట్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ (14 years 23 days) కొనసాగుతున్నాడు. ” క్రికెట్ ప్రభావం అధికంగా ఉండడం.. క్రికెటర్లకు మన దేశంలో లభిస్తున్న గౌరవాన్ని చూసి చాలామంది యువకులు.. క్రికెట్ పై విపరీతంగా మక్కువ పెంచుకుంటున్నారు. చదువుకుంటే సరైన సమయంలో ఉద్యోగాలు రాకపోవడం.. చదువుకు తగ్గట్టుగా కొలువులు లభించకపోవడం వల్ల చాలామంది యువత క్రికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. విరివిగా అవకాశాలు లభించడం.. ఐపీఎల్ తర్వాత క్రికెట్ స్వరూపం మొత్తం మారిపోవడంతో.. చాలామంది క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంటున్నారు. ఐపీఎల్ మాత్రమే కాకుండా వివిధ ప్రీమియర్ లీగ్లలో ఆడే అవకాశం లభిస్తోంది. ఆదాయం కూడా దండిగా వస్తోంది. ఒకవేళ ప్రీమియర్ లీగ్లలో అదరగొడితే.. ఐపీఎల్ లో ఎలాగూ అవకాశం లభిస్తున్నది. ఒకవేళ జట్ల యాజమాన్యాలు భారీగా గనక ధర చెల్లిస్తే జీవితమే మారిపోతుంది. అందువల్లే చాలామంది యువకులు క్రికెట్ వైపు వస్తున్నారు. క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంటున్నారని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు..
CRAZY SHOTS AT THE AGE OF 17 pic.twitter.com/lcXKpzde2J
— Johns. (@CricCrazyJohns) April 20, 2025