Mustafizur-Rahman-IPL-2024-CSK-B
IPL 2024 : అభిమానుల రెట్టించిన ఉత్సాహం మధ్య ఐపిఎల్ 17వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు చెన్నైలోని చిదంబరం మైదానంలో మొదలైంది. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ జోడీగా డూప్లెసెస్, విరాట్ మైదానంలోకి వచ్చారు. విరాట్ నిదానంగా బ్యాటింగ్ చేయగా.. డు ప్లెసిస్ ఉన్నంతలో మెరుపులు మెరిపించాడు. 22 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 35 పరుగులు చేశాడు. ఫలితంగా బెంగళూరు స్కోరు 4 ఓవర్లలోనే 40 రన్స్ కు చేరుకుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ నాలుగో ఓవర్ లో బెంగళూరు కు కోలుకోలేని షాకిచ్చాడు.
ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని డు ప్లెసిస్ లాంగ్ ఆన్ లోకి ఆడాడు. అయితే అక్కడే ఉన్న రచిన్ రవీంద్ర అమాంతం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి.. బంతిని ఒడిసిపట్టాడు. దీంతో బెంగళూరు జట్టు 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అదే స్కోర్ వద్ద అదే ఓవర్లో ముస్తాఫిజుర్ వేసిన ఐదవ బంతిని రజత్ పాటిదార్ తప్పుగా అంచనా వేశాడు. బంతి బ్యాట్ చివరి అంచును తాకి కీపర్ ధోని చేతిలో పడింది. దీంతో బెంగళూరు జట్టు రెండవ వికెట్ కోల్పోయింది..
అనంతరం ఐదో ఓవర్ దీపక్ చాహర్ వేశాడు. ఐదో ఓవర్ రెండవ బంతికి ప్రమాదకరమైన మాక్స్ వెల్ అవుట్ అయ్యాడు. చాహర్ వేసిన బంతి నేరుగా దూసుకొచ్చింది. దాన్ని ఎలా ఆడాలో తెలియక మాక్స్ వెల్ అనవసరంగా బ్యాట్ ను ముందుకు కదిలించాడు. దీంతో బంతి బ్యాట్ చివరి అంచును తాకుతూ నేరుగా కీపర్ ధోని చేతిలోకి వెళ్ళింది. దీంతో ఒకసారిగా బెంగళూరు జట్టులో నిశ్శబ్దం అలముకుంది.. బెంగళూరు జట్టులో డు ప్లెసిస్, రజత్ పాటిదార్ వికెట్లను ఒకే ఓవర్ లో తీసి ముస్తాఫిజుర్ చావు దెబ్బతీశాడు. బెంగళూరు బ్యాటర్లలో మాక్స్ వెల్, పాటి దార్ డక్ ఔట్ కావడం విశేషం.
వాస్తవానికి ముస్తాఫిజుర్ వారం క్రితం మైదానంలో గాయపడ్డాడు. తలకు గాయం కావడంతో వారం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య కీలక టోర్ని ఉన్నప్పటికీ, దాన్ని కాదనుకొని నేరుగా ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెన్నై జట్టు శిబిరంలో చేరాడు. నిరాటంకంగా ప్రాక్టీస్ చేసి.. ప్రారంభ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న బెంగళూరు ఆటగాడు డు ప్లెసిస్ ను అవుట్ చేసి చెన్నై శిబిరంలో ఆనందం నింపాడు. అదే ఓవర్లో రజత్ పాటిదార్ ను బోల్తా కొట్టించి తాను ఎంత ప్రత్యేకమో నిరూపించాడు.
వీరిని మాత్రమే కాదు విరాట్ కోహ్లీ (21), గ్రీన్(18) ని కూడా ముస్తాఫిజుర్ ఔట్ చేసాడు. కోహ్లీ 11 ఓవర్ రెండో బంతికి రచిన్ రవీంద్ర కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 ఓవర్ నాలుగో బతికి గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న తరుణంలో ముస్తాఫిజుర్ దాటికి నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. డు ప్లెసిస్, మాక్స్ వెల్, విరాట్ కోహ్లీ, గ్రీన్ వికెట్లను ముస్తాఫిజుర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు బెంగళూరు జట్టు ఐదు వికెట్ల కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజ్ లో రావత్ (8), కార్తీక్ (4) ఉన్నారు.
All Happening Here!
Faf du Plessis ✅
Rajat Patidar ✅
Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style #RCB are 3 down for 42 in 6 overs!Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY
— IndianPremierLeague (@IPL) March 22, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ipl 2024 mustafizur rahman took four wickets to beat bengaluru
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com