https://oktelugu.com/

IPL 2021: కల చెదిరే.. కోల్ కతా ప్లే ఆఫ్స్ కు.. ముంబై ఇండియన్స్ ఇంటికి..

IPL 2021: ఐపీఎల్ లో ఐదు సార్లు డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్టే. టీమిండియా కెప్టెన్ రేసులో ఉన్న రోహిత్ శర్మ తాజాగా ప్రపంచకప్ తర్వాత కోహ్లీ నుంచి పగ్గాలు అందుకోనున్నాడు. ఇలాంటి సమయంలో తన ముంబై టీంను సెమీస్ కు చేర్చలేక చతికిలపడ్డాడు. నిన్న రాత్రి జరిగిన కీలకమైన రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఫలితంతో 4వ ఆఖరి ప్లే ఆఫ్ బెర్త్ ను కోల్ కతా కైవసం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2021 / 11:08 AM IST
    Follow us on

    IPL 2021: ఐపీఎల్ లో ఐదు సార్లు డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్టే. టీమిండియా కెప్టెన్ రేసులో ఉన్న రోహిత్ శర్మ తాజాగా ప్రపంచకప్ తర్వాత కోహ్లీ నుంచి పగ్గాలు అందుకోనున్నాడు. ఇలాంటి సమయంలో తన ముంబై టీంను సెమీస్ కు చేర్చలేక చతికిలపడ్డాడు.

    నిన్న రాత్రి జరిగిన కీలకమైన రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఫలితంతో 4వ ఆఖరి ప్లే ఆఫ్ బెర్త్ ను కోల్ కతా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా ఏకంగా 86 పరుగుల తేడాతో రాజస్థాన్ ను చిత్తు చేసింది. రాజస్థాన్ ఈ ఓటమితో ఇంటి బాట పట్టింది. అదే సమయంలో తనతోపాటు ప్లే ఆఫ్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్, పంజాబ్ ను కూడా ఇంటికి తీసుకెళ్లింది.

    ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా రెచ్చిపోయింది. రాజస్థాన్ పై భారీ విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో రాజస్థాన్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ వేరే సమీకరణాలు.. ముంబై ఇండియన్స్ గెలుపుతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది.

    ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కు దాదాపు ప్లే ఆఫ్ రేసు మూసుకుపోయింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నట్లే.. హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ముంబై 171 పరుగుల తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళుతుంది. లేకుంటే కోల్ కతా ప్లే ఆఫ్స్ కు చేరినట్టే.

    ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ నుంచి దాదాపుగా ఔట్ అయినట్టే.. కాకపోతే ఒక్క ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న రోహిత్ సేన హైదరాబాద్ పై గెలవాలి.. అదీ మామూలు విజయం కాదు.. భారీ తేడాతో విజయం సాధించాలి.. ఏకంగా 170 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించాలి. కానీ అది అసాధ్యం.. అందుకే ప్లే ఆఫ్స్ కు ముంబై చేరడం కష్టమేనంటున్నారు. దాదాపు ముంబై ఐపీఎల్ నుంచి ఈ సీజన్ లో ఇంటిదారి పట్టినట్టేనంటున్నారు.