Karthika Deepam: బుల్లితెరపై ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ రోజురోజుకు విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంటున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ నేడు ఎంతో ఆసక్తికరంగా ఉండనుంది. హిమ సౌర్యతో మాట్లాడుతూ హాస్పిటల్ లో తన విన్నది మొత్తం చెబుతుంది. డాడీ మనం అనుకున్నంత మంచోడు కాదు మనం విజయనగరం వెళ్ళిపోయినప్పుడు డాడీ మోనితను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడట.. తాతయ్య కూడా అమ్మమ్మ చనిపోయిన తర్వాతనే భాగ్యం అమ్మమని పెళ్లి చేసుకున్నారట అంటే భార్య చనిపోయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలి ఎందుకు మాట ఇచ్చాడు అంటూ ఏడుస్తుంది. అందుకు సౌర్య మనం వెళ్ళిపోయామనే బాధలో నాన్న అలా చెప్పి ఉంటాలే అంటూ ధైర్యం చెప్పినప్పటికీ ఏడుస్తూనే ఉంటుంది.

మరొకవైపు దీప పువ్వులు నగలన్నీ తీసేసి పాత చీర కట్టుకొని అన్ని తలుచుకుని బాధ పడుతుంది. అది చూసిన సౌందర్య నీకోసం చేయించిన బంగారు నగలన్నీ ఏం చేయమంటావ్ ఇలా ఉండటం కోసమేనా అని అడగగా బంగారం లాంటి జీవితమే పోయింది. ఇక ఆ బంగారంతో పనేంటి అని సమాధానం చెబుతుంది. ఆ పువ్వులను చూస్తుంటే చిట్టి తల్లులు అడిగిన ప్రశ్నలు గుర్తుకొస్తున్నాయి. ఆ మొగ్గులను చూస్తుంటే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తుకు వస్తుంది అంటూ బాధపడుతుంది. ఇక హాస్పిటల్లో భారతిని పిలిచిన కార్తీక్ మోనిత గురించి మాట్లాడుతాడు. భారతి కూడా నీకు తెలుసు కదా తను ఎలా మొండిదో చెప్పినా కూడా వినడం లేదు.. అయినా మోనిత కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వే కదా అంటుండగానే ఇక ఆపు భారతి ఈరోజు నన్ను చూడటం కోసం హాస్పిటల్ కి వచ్చింది. రేపు నా బర్త్ డే అయితే సరాసరి ఇంటికి వస్తుందేమో అంటూ అసహ్యించుకుంటారు.ఇక ఈ ఆపరేషన్ నేను చేయలేను నువ్వే చెయ్యి నేను నీకు ఏదైనా సహాయం చేస్తానని కార్తీక్ భారతికి చెబుతాడు.
ఇక జైల్లో సుకన్య,మోనిత మాట్లాడుతుండగా ఒక ఆమెను చూయించి ఇంత మంచి కళ ఉన్న ఆమె జైలుకి ఎందుకు వచ్చిందని అడగగా … తను ఎంతో కట్న కానుకలు ఇచ్చి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను రెండో పెళ్లి చేసుకుని ఆమె దగ్గర ఉండడంతో ఏకంగా తనని చంపి జైలుకి వచ్చింది. ఎంతైనా ఒక భర్త ఇద్దరు భార్యలు కాదు కదా మేడమ్ అని సుకన్య అనడంతో ఆ మాటలు మోనితకు ఎక్కడో తగులుతాయి. అప్పుడు నువ్వు వెళ్ళు నేను వస్తాను అని సుకన్యను పంపించి కార్తీక్ మొదటి భార్య దీప. నేను ప్రియురాలినా. కాదు కాదు ముందు నేనే ప్రేమించాను కాబట్టి కార్తీక్ భార్యను నేనే అంటూ మనసులో అనుకుంటుంది. ఇక ఆనంద్ రావు లాయర్ తో మాట్లాడి మోనిత చేస్తున్న పనులకు కోపం తెచ్చుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం మోనితకి సుకన్య టిఫిన్ తీసుకొస్తూ మేడం మీరు చెప్పిన పని అయిపోయింది అతనితో మాట్లాడాను చేస్తానని చెప్పారు అనగా మోనిత ఎంతో సంతోషపడుతుంది. ఇక వంటలక్క ఇంటిలో ఏం జరిగినా నాకు తెలిసిపోతుందనీ మనసులో సంతోషపడుతుంది సుకన్య నాకు ఒక పని చేసి పెడతావా అని అడగగా ఏంటో చెప్పండి మేడం అంటూ మరొక ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. మరుసటి రోజు గుడికి వెళ్ళిన దీప ఇవన్నీ ఆలోచిస్తూ మోనిత మరింత శిక్ష పడేలా చేయాలి.. ముందు రోషిని మేడంని కలవాలి అంటూ బయలు దేరుతుంది.