IPL 2021: దుబాయ్ వేదికగా మొదలైన ఐపీఎల్-2021 సెకండ్ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. అన్ని జట్లూ పోటా పోటీగా తలపడుతున్నాయి. దీంతో ఐపీఎల్ మజాను ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. తాజాగా.. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ లలో ముంబై పై రాజస్థాన్ రాయల్స్ జట్టు జయకేతనం ఎగరేసింది. అటు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో.. పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాయింట్ల ఆధారంగా ఎవరి స్థానం ఏంటన్నది చూద్దాం.
ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లు సాధించిన ధోనీ బృందం.. మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. అయితే.. ఢిల్లీ కూడా 8 మ్యాచ్ లు గెలిచినప్పటికీ.. నెట్ రన్ రేట్ ఆధారంగా చెన్నై జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక, మూడో స్థానంలో బెంగళూరు జట్టు నిలిచింది. ఈ జట్టు 12 పాయింట్లు సాధించింది.
కోల్ కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు ఐదో స్థానంలో.. రాజస్థాన్ రాయల్స్, ముంబై జట్లు ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి స్థానంలో ఉంది. ఇంకా మ్యాచులు మిగిలి ఉన్న నేపథ్యంలో జట్ల స్థానాలు మారే అవకాశం ఉంది.
జట్ల పాయింట్ల వివరాలు ఇలా ఉంటే.. ఆటగాళ్ల పర్సనల్ టాలెంట్ ఏంటన్నది చూద్దాం. టాప్ ప్లేయర్ గా ఉన్న ఆటగాడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడన్న సంగతి తెలిసిందే. మరి.. ఈ క్యాప్ ను ఎవరు దక్కించుకుంటారు? అన్నది చూస్తే.. ప్రస్తుతం టాప్ స్కోరర్ గా ఉన్నాడు శిఖర్ ధావన్. 430 పరుగులు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు గబ్బర్.
ఆ తర్వాత పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. 401 పరుగులు సాధించిన ఈ స్టార్ బ్యాట్ మెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో సెకండ్ ప్లేసులో కొనసాగుతున్నాడు. అదేవిధంఆ.. పర్పుల్ క్యాప్ రేసు గురించి చూస్తే.. ఆర్సీబీకి చెందిన బౌలర్ హర్షల్ పటేల్ 23 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఢిల్లీ బౌలర్ అవేష్ ఖాన్ ఉన్నాడు. ఇతను ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు క్రిస్ మోరీస్ 14 వికెట్లతో 3వ ప్లేసులో ఉన్నాడు.