Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen Funky Movie OTT Release: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసిన విశ్వక్ సేన్...

Vishwak Sen Funky Movie OTT Release: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసిన విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్రం.. ఎందులో చూడాలంటే!

Vishwak Sen Funky Movie OTT Release: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie), గత నెల 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ తగ్గట్టుగానే వసూళ్లు కూడా ఓపెనింగ్స్ నుండే తీవ్రమైన నిరాశకు గురి చేసింది. గతంలో విశ్వక్ సేన్ మొదటి రోజు రాబట్టే వసూళ్లను , ఈ సినిమా క్లోజింగ్ లో కూడా రాబట్టలేకపోవడాన్ని చూస్తుంటే ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. అసలే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్ , ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అనుకుంటే, మరో డిజాస్టర్ ని మూటగట్టుకుంటాడని అసలు ఊహించలేదంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి క్లోజింగ్ లో 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.

Also Read: తెలంగాణ రాష్ట్ర ఖజానా ‘నిల్’నా?

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ప్రతీ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ నే కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా విడుదలకు ముందే మంచి రేటుకి అమ్మేశారు. నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి అనే ఒప్పందం కుదిరించుకోవడం తో ఈ సినిమాని ఈ నెల 12 లేదా 13 వ తేదీల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ , ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలాంటి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు విశ్లేషకులు.

ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గతం లో ఈయన ‘జాతి రత్నాలు ‘, ‘ప్రిన్స్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల కారణంగా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. టాక్ రాకపోవడం వల్ల జనాలు థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూసి ఉండకపోవచ్చు కానీ, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా చూస్తారని, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే తన స్వీయ దర్శకత్వం లో ‘కల్ట్’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. అదే విధంగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రం లో నటించబోతున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version