అక్కినేని సమంత తాను వర్షంలో సైక్లింగ్ చేసిన వీడియోని షేర్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇంతకీ వర్షంలో సమంతకి సైక్లింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి అంటే.. ? సమంత హైదారాబాద్ లోని రైడింగ్ గ్రూప్ సభ్యుల కోసం సైక్లింగ్ చేసింది. ఇక సామ్ తో పాటు కొంతమంది పారా సైక్లిస్టులు కూడా సరాదాగా రైడింగ్ చేశారు. అయితే ఇదంతా షూట్ చేసి ఈ వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పైగా ఈ వీడియోకి ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అంటూ ఓ క్యాచీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక సమంత సైక్లింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఏకంగా 21 కీమీ ప్రయాణించింది. అలాగే తన లక్ష్యం 100 కీమీ అని.. ఆ దిశగా తానూ ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సైక్లింగ్ రైడింగ్ గురించి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన సమంత ‘డే1, 21 కీమీ, ఇక 100 కీమీ.. నీ కోసమే వస్తున్నా’ అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టింది.
మొత్తానికి సమంత షేర్ చేసిన ఈ వీడియోకి గంటల వ్యవధిలోనే 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పైగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి సమంత తనను తాను బిజీ చేసుకోవడానికే ఇలాంటి ప్రోగ్రామ్ లు పెట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు.
గత వారం సమంత.. త్రిష, కీర్తి సురేష్, కళ్యాణ్ ప్రియదర్శన్ లతో కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. వీరి పార్టీ తాలూకు ఫోటోలను, వీడియోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం, అవి కాస్త బాగా వైరల్ అవ్వడం తెలిసిందే. ఇక ఈ వారం సైక్లింగ్ రైడింగ్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.
గత కొన్ని రోజులుగా సమంత – చైతు విడిపోతున్నారు అని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారా ? లేదా ? అనేది ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు. ఇటు సమంతతో పాటు అటు చైతు కూడా ఇప్పటివరకు ఈ పుకార్ల పై స్పందించడానికి ఆసక్తి చూపించలేదు.