Shubman Gill Captaincy: అండర్సన్ – సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మొదలైంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. మరో మాటకు తావులేకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది.. పర్యాటక జట్టు సారథి నిరాశపరిచినప్పటికీ.. భారీగా పరుగులు చేసే సందర్భంలో ఓపెనర్ రాహుల్ అవుట్ అయినప్పటికీ.. అర్థ సెంచరీ చేసిన యశస్వి పెవిలియన్ చేరుకున్నప్పటికీ.. సాయి సుదర్శన్, రిషబ్ పంత్ ఆడుతున్నారు. పంత్ కు గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రవీంద్ర జడేజా ఆడుతున్నాడు.
Also Read: బద్దలవ్వడానికి 5 రికార్డులు సిద్ధం.. మాంచెస్టర్ లో టీమిండియా అద్భుతం చేస్తుందా?
వాస్తవానికి ఈ మైదానంలో భారత్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక రకంగా ఇంగ్లాండ్ గడ్డమీద భారత జట్టుకు అత్యంత నష్టదాయకమైన మైదానాలలో మాంచెస్టర్ ఒకటి.. ఈ మైదానంలో ఆడుతున్న నేపథ్యంలో.. భారత జట్టుపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎందుకంటే లార్డ్స్ లో గెలుపు దాకా వచ్చిన మ్యాచ్ ను భారత్ దురదృష్టవశాత్తు కోల్పోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్ గనుక గెలిచి ఉంటే సిరీస్ లో 2-1 వ్యత్యాసంతో అప్పర్ హ్యాండ్ లో ఉండేది . అనుకోకుండా ఏదైనా ఓటమితో భారత్ ఈ సిరీస్లో వెనుకబడిపోయింది. దీంతో ప్రస్తుతం నాలుగో టెస్టులో గెలవాల్సిన పరిస్థితి భారత జట్టుపై ఉంది..
భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డమీద టెస్ట్ సిరీస్ గెలవక దాదాపు 18 సంవత్సరాలు అయింది. క్రితం సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా గెలవడానికి అన్ని దారులు అనుకూలంగా మారాయి. 2021లో భారత్ 2-1 లీడ్ లో ఉంది. అయితే అప్పటికి కరోనా మహమ్మారి వల్ల చివరి టెస్ట్ వాయిదా వేశారు. దానిని 2022లో నిర్వహించారు. అయితే నాటి మ్యాచ్లో కోహ్లీ సేన ఓడిపోయింది.. పర్యాటక జట్టు భారీ స్కోర్ చేసినప్పటికీ ఆతిధ్య జట్టు దానిని చేదించింది. తద్వారా సిరీస్ డ్రా అయింది. ఇప్పుడు ప్రస్తుతం పర్యాటక జట్టు 1-2 తేడాతో ఇబ్బందుల్లో ఉంది.. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే టెస్ట్ గెలిచి.. చివరి టెస్టులో కూడా విజయం సాధిస్తే పర్యాటక జట్టు అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటుంది. అంతేకాదు 18 సంవత్సరాల నిరీక్షణకు ఎండ్ కార్డు వేస్తుంది.
Also Read: అందువల్లే రిషబ్ పంత్ కు గాయం.. ఇలాగైతే కెరియర్ ముగియడం ఖాయం
ప్రస్తుతం భారత జట్టు గిల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ జట్టుతో పోరాడుతోంది. ఒకరిద్దరు మినహా మిగతా ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంగ్లాండ్ గడ్డమీద.. ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. వికెట్లు తీసిన బౌలర్ల జాబితా బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ గిల్ కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ రెండు టెస్టులలో విజయం సాధించినప్పటికీ.. భారత బౌలర్ల స్థాయిలో ఆ జట్టు బౌలర్లు వికెట్లు పడగొట్టలేకపోయారు. భారత బ్యాటర్ల స్థాయిలో ఆ జట్టు బాటర్లు పరుగులు తీయలేకపోయారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో భారత్ గనుక విజయం సాధిస్తే.. అప్పుడు టెస్ట్ సిరీస్ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికైతే భారత బ్యాటింగ్ సజావుగా సాగుతోంది కాబట్టి.. మ్యాచ్ ఫలితం భారత జట్టుకు అనుకూలంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.