India Records to be Broken: అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ లో భాగంగా ఇంగ్లీష్ గడ్డపై నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య జట్టు 2-1 లీడ్ లో కొనసాగుతోంది. ఈ మైదానంలో జరిగే నాలుగో టెస్ట్ లో గనుక భారత పడిపోతే సీరియస్ కోల్పోయినట్టే. అప్పుడు ఇంగ్లాండ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని లీడ్ లో కొనసాగుతుంది.. అయితే ఈ టెస్ట్ ప్రారంభాని కంటే ముందు భారత జట్టు బద్దలు కొట్టగల ఐదు రికార్డులను ఒకసారి పరిశీలిస్తే..
జస్ ప్రీత్ బుమ్రా
జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా స్పీడ్ గన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఈ దేశంపై ఆడుతూ నాలుగు సార్లు ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.. నాలుగో టెస్ట్ మొదలయ్యే ఈ మైదానంలో అతడు ఒక ఇన్నింగ్స్ లో గనుక ఐదు వికెట్లు సాధిస్తే.. ఇంగ్లీష్ గడ్డమీద ఐదు వికెట్ల ఘనతను సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాదు శ్రీలంక దిగ్గజం మురళీధరన్ సరసన చేరతాడు. మురళీధరన్ ఇంగ్లీష్ గడ్డ మీద ఐదు సార్లు 5 వికెట్ ఘనతను సృష్టించాడు.
రిషబ్ పంత్ ముందు 61 ఏళ్ల రికార్డ్..
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరో 101 పరుగులు గనుక అతడు చేస్తే 61 సంవత్సరాల రికార్డును బద్దలు కొడతాడు. ఎందుకంటే ఒక సీరియస్ లో హైయెస్ట్ రన్స్ చేసిన వికెట్ కీపర్ గా బుద్ధి కుందరన్ పేరు మీద రికార్డు ఉంది. ఇతడు 1963-64 కాలంలో ఇంగ్లీష్ జట్టు మీద టెస్ట్ సిరీస్ లో 525 రన్స్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు మీద పంత్ 425 పరుగులు చేశాడు. మరో 101 పరుగులు చేస్తే 61 సంవత్సరాల రికార్డు తుడిచిపెట్టుకుపోతుంది.
కేఎల్ రాహుల్ 1000 వాలా
ఇంగ్లీష్ జట్టు మీద 1000 పరుగులు పూర్తి చేయడానికి టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 11 పరుగుల దూరంలోనే ఉన్నాడు. మరో 11 పరుగులు గనుక చేస్తే సునీల్ గవాస్కర్ అనంతరం ఇంగ్లీష్ జట్టు మీద 1000 పరుగులు పూర్తిచేసిన రెండవ భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టిస్తాడు.
రూట్ కూడా..
టీమిండియా ప్లేయర్లు మాత్రమే కాకుండా.. ఇంగ్లీష్ ఆటగాడు రూట్ కూడా మరో అరుదైన రికార్డు కు దగ్గర్లో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రూట్ ఇప్పటివరకు 37 సెంచరీలు చేశాడు. వీటిలో 11 శతకాలు భారతదేశం పై సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ కూడా భారతదేశంపై 11 శతకాలు సాధించాడు. ఇంకొక శతకం చేస్తే భారతదేశంపై సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రూట్ నిలుస్తాడు.
మాంచెస్టర్ లో ప్లేయర్లు మాత్రమే కాకుండా హిస్టారికల్ రికార్డును తన ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మైదానంలో ఇంతవరకు భారత్ జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఒకవేళ ఇక్కడ గెలిస్తే భారత జట్టుకు అది తొలి విజయం అవుతుంది. అంతే కాదు టెస్ట్ సిరీస్ కూడా 2-2 తో సమం అవుతుంది.