Father Sacrifice Story: తల్లి ప్రేమ కనిపిస్తోంది. తండ్రి త్యాగం కనిపించదు.. తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది. వెన్నెల్లో ఆడిపిస్తుంది. ఆ గోరుముద్దులు కంచంలోకి రావడానికి.. వెన్నెల వెలుగు ఇంటి ముందు కనిపించడానికి తండ్రి చేసే త్యాగం ఎవరికీ కనిపించదు. అమ్మ ప్రేమకు రూపమైతే.. నాన్న త్యాగానికి ప్రతిరూపం. ఈ భూమ్మీద బహుశా నాన్నలు మొత్తం ఇలానే ఉంటారేమో.. తన కుటుంబం కోసం.. తన కన్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. ఎక్కడిదాకయినా వెళ్తారు. చివరికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంటారు.. అలాంటిదే ఈ కథ కూడా.
Also Read: ఒక్క ఆలోచన.. ఏపీ తీరప్రాంత రైతుల కష్టాలు తీర్చింది
ఆ వ్యక్తికి 60 సంవత్సరాలు. గతంలోనే అతడికి క్యాన్సర్ సోకింది.. క్యాన్సర్ చేసినప్పటికీ ఖచ్చితమైన ఆహార విధానాన్ని.. క్రమం తప్పకుండా మందులను వాడి దానిని తగ్గించుకున్నాడు. ఒకరకంగా క్యాన్సర్ వ్యాధిని చేయించాడు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. క్యాన్సర్ సోక ముందుకు ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. తన కుటుంబం కోసం తీవ్రంగా కష్టపడేవాడు. పిల్లల కోసం.. వారి ఉన్నతి కోసం రెక్కల ముక్కలు చేసుకునేవాడు. చివరికి కుటుంబాన్ని ఒకదారికి తీసుకొచ్చాడు.. ఈలోగానే అతనికి క్యాన్సర్ సోకడంతో ఒకసారిగా డీలా పడిపోయాడు. చివరికి మందులు వాడి.. అత్యంత ఆధునికమైన చికిత్స తీసుకొని వ్యాధిని నయం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతడు తన మునుపటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కానీ ఇంతలోనే ఆ వ్యక్తికి దుర్వార్త తెలిసింది.. అది అతడి గుండెను మెలి పెట్టింది.
ఆ 60 సంవత్సరాల వ్యక్తికి 37 సంవత్సరాల లక్ష్మణుడు అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మణుడు మొన్నటి దాకా బాగానే ఉండేవాడు. అయితే ఇటీవల అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మూత్రపిండాలు పాడయ్యాయని పేర్కొన్నారు. దీంతో లక్ష్మణుడి కుటుంబం ఒక్కసారిగా నిర్వేదంలో కూరుకుపోయింది. లక్ష్మణుడి బ్లడ్ గ్రూప్ కు అనుగుణంగా మూత్రపిండం ఇచ్చే దాతల కోసం వారంతా వెతికారు. ఉపయోగం లేకపోవడంతో లక్ష్మణుడి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు.. ఆసుపత్రిలో మంచం మీద అచేతనంగా ఉన్న తన కొడుకుని చూసి ఒక్కసారి గా కన్నీటి పర్యంతమయ్యాడు. తన బతకకపోయినా పర్వాలేదు.. కుమారుడు బాగుండాలని కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. దీంతో వైద్యులు అతడిని పరీక్షించారు. ఆ తర్వాత అతడి నుంచి మూత్రపిండాన్ని సేకరించి లక్ష్మణుడికి అమర్చారు. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరు బాగానే ఉన్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది.
Also Read: టీడీపీలో వ్యతిరేకత.. వైసీపీలోకి ‘కొలికపూడి’.. ఇదే సాక్ష్యం?
ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, వాటాల కోసం తల్లిదండ్రులను పిల్లలు అత్యంత హీనంగా చూస్తున్న రోజులు ఇవి. అవసరమైతే అత్యంత దారుణమైన ఘాతుకాలకు పాల్పడుతున్న దుర్మార్గపు రోజులు ఇవి. ఈ కాలంలో తన కొడుకును కాపాడుకోవడానికి ఒక తండ్రి ప్రయత్నించడం.. అది కూడా క్యాన్సర్ ను జయించి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో తన కొడుకుకు కిడ్నీ ఇవ్వడం నిజంగా అభినందనీయం.. ఈ సంఘటన తండ్రి కొడుకుల అనుబంధానికి బలమైన నిదర్శనంగా నిలుస్తోందని విశాఖపట్నంలోని ఆ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.