Rishabh Pant Injured: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు. ఏడాదిపాటు ఆసుపత్రికి మాత్రమే పరిమితమయ్యాడు. మూడు నెలల పాటు కనీసం బ్రష్ కూడా చేసుకోలేదు.. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అడుగు తీసి అడుగు పెట్టడానికి దాదాపు 6 నెలలు పట్టింది. మైదానంలోకి రావడానికి ఏడాదిన్నర పట్టింది. వాస్తవానికి అతని స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఈ సమయానికి అతని ఫోటో గోడకు వేలాడుతూ ఉండేది. కానీ రిషబ్ పంత్ కు భూమ్మీద నూకలు ఉండడంతో బతికి బట్ట కట్ట కలిగాడు.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
అలా లభించిన జీవధానాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా రిషబ్ పంత్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ముఖ్యంగా తన కెరియర్ ను తనే ప్రశ్నార్ధకం చేసుకుంటున్నాడు. వాస్తవానికి రిషబ్ పంత్ దూకుడుగా ఆడే వ్యక్తి. బౌలర్ ఎవరనేది చూడడు. మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులకు నూటికి నూరు శాతం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాడు. చిత్ర విచిత్రమైన భంగిమలలో బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతుంటాడు. అటువంటి ఆటగాడు ప్రస్తుతం షాట్ల ఎంపికలో కచ్చితత్వం లేకుండా పోవడంతో గాయాల బారిన పడుతున్నాడు. వాస్తవానికి నాలుగో టెస్ట్ తొలి రోజు వోక్స్ వేసిన బంతిని అలాగే వదిలిపెట్టి ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయాడు. ఆ బంతి కాస్త అతడి పాదానికి తగిలింది. దీంతో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. కనీసం అడుగు తీసి అడుగు కూడా పెట్టలేకపోయాడు. మైదానంలోకి అంబులెన్స్ వచ్చిందంటే రిషబ్ పంత్ కు గాయం ఏ స్థాయిలో అయిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతో రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెను తిరగక తప్పలేదు. అంబులెన్సులో అతడిని తీసుకురావడంతో కెప్టెన్ గిల్ ఆందోళనతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.
రిషబ్ పంత్ ఈ సిరీస్లో గాయపడడం ఇది రెండవసారి. ఇటీవల మూడో టెస్టులో అతడి చేతి వేలికి గాయమైంది. దీంతో కీపింగ్ జూరెల్ చేశాడు. మూడో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో అంత నొప్పితోనూ బ్యాటింగ్ చేసేందుకు పంత్ వచ్చాడు. కానీ ఆర్చర్ బౌలింగ్లో దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. పంత్ కు వరుసగా గాయాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. మాజీ క్రికెటర్లు సైతం అదే భావన వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు గొప్ప ఇన్నింగ్స్ ఆడాలి అనుకుంటారని.. ఇదే సమయంలో దూకుడు తత్వాన్ని ప్రదర్శిస్తారని.. అది అన్ని సందర్భాలలో సాధ్యం కాదని.. సాధ్యమైనంతవరకు షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ప్లేయర్లు సూచిస్తున్నారు..” పంత్ ఎంతో విలువైన ఆటగాడు. అలాంటి ఆటగాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా వేగంగా ఆడేక్రమంలో శరీరాన్ని గాయపరచుకోకూడదు. సాధ్యమైనంతవరకు ఆత్మ రక్షణ ధోరణిలో ఆడాలి. మిగతా ఫార్మాట్ లో వేగంగా పరుగులు తీయాల్సి ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ లో అలా కాదు కదా.. రోజంతా బ్యాటింగ్ చేసినా అనేవాడు ఉండడు. పైగా పరుగులు ఎంత నిదానంగా వస్తే అంత బాగుంటుంది.. ఆ విషయాన్ని పంత్ లాంటి ప్లేయర్లు గుర్తుంచుకోవాలని” సీనియర్ ప్లేయర్లు సూచిస్తున్నారు..
రిషబ్ పంత్ కు తీవ్రంగా గాయమైన నేపథ్యంలో అతడు నాలుగో టెస్ట్ ఆడేది అనుమానమేనని అని తెలుస్తోంది. ఇప్పటికే అతడిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని.. స్కానింగ్ రిపోర్ట్ లు కూడా వచ్చాయని.. పాదానికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని.. బిసిసిఐ వెల్లడించింది. రిషబ్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఒక ట్వీట్లో వివరించింది. పంత్ గాయపడిన నేపథ్యంలో నాలుగో టెస్టులో జూరెల్ లేదా కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది.
:
Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test.
He was taken for scans from the stadium.
The BCCI Medical Team is monitoring his progress.
— BCCI (@BCCI) July 23, 2025