Rohit Sharma goodbye BCCI signals : ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ గతం ఎవరి గురించి అనేది.. టీమ్ ఇండియాను ఏడాది వ్యవధిలో రెండుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. గత ఏడాది పొట్టి ఫార్మాట్.. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పకుండా విషయం తెలిసిందే. ఇక 50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ కొనసాగుతున్నాడు.. ఒక అంచనా ప్రకారం 2027 విశ్వ సమరం వరకు అతడు ఆ ఫార్మాట్లో కొనసాగే అవకాశం ఉందని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే అతడిని ఆ ఫార్మాట్ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయ్యర్ లేదా గిల్ ను సారధిగా నియమిస్తారని తెలుస్తోంది. వన్డే సారధ్య బాధ్యతలనుంచి తప్పుకోవాలని రోహిత్ కు బిసిసిఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే పెద్దల నిర్ణయంతో హిట్ మాన్ కూడా ఒక రకమైన డిఫెన్స్ లో పడిపోయినట్టు సమాచారం. సుదీర్ఘ ఫార్మాట్లో సరిగా పరుగులు చేయలేకపోతున్న నేపథ్యంలో ఇటీవల హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన వన్డేఫార్మాట్లో మాత్రమే కొనసాగాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. అయితే రోహిత్ ఆశలపై బీసీసీఐ పెద్దలు నీళ్లు చల్లుతున్నట్టు తెలుస్తోంది. 2027 విశ్వసమరానికి చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచి జట్టును సంసిద్ధం చేయాలని ఆలోచనలు బోర్డు పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జట్టుతో పాటు సారధిని కూడా సిద్ధం చేయాలనే ఆలోచనలో బోర్డు పెద్దలు ఉన్నారు.
Also Read : రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది
రోహిత్ వయసు ప్రకారం చూసుకుంటే అతడు 2027 వరకు జట్టులో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఏడు నాటికి రోహిత్ 40 సంవత్సరాల వయసుకు చేరుకుంటాడు. ఆ వయసులో అత్యంత ఎఫెక్టివ్ క్రికెట్ ఆడాలంటే కష్టం. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ అంటే కాస్త ఇబ్బంది కరం. అందువల్లే అతని స్థానంలో గిల్ లేదా అయ్యర్ ను సారధిగా నియమిస్తారని తెలుస్తోంది.. వీరి ఆధ్వర్యంలోనే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా సఫారీ గడ్డమీద అడుగుపెట్టాలని బీసీసీఐ పెద్దలు అంచనా తో ఉన్నారు. అదే ఇప్పటికే ఈ విషయంపై బోర్డు పెద్దలు రోహిత్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. త్వరలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో భారత జట్టుకు కొత్త సారధి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అయ్యర్ ను కనుక సారధి గా నియమిస్తే.. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ముగ్గురు సారథులు ఉంటారు. ఎప్పటినుంచో ఈ విధానం అమలు చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది.
అయితే రోహిత్ ను బిసిసిఐ పెద్దలు సంప్రదించారనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోయినప్పటికీ.. జాతీయ మీడియాలో మాత్రం ఇదే అంశానికి సంబంధించి వార్తలు తెగ ప్రసారం అవుతున్నాయి. అటు అధికారికంగా ఈ విషయాన్ని బీసీసీఐ.. ఇటు రోహిత్ శర్మ వెల్లడించలేదు. జరుగుతున్న పరిణామం ఊహాగానమా? లేకుంటే బోర్డు పెద్దలు లీకులు ఇస్తున్నారా? అనేది తెలియడం లేదు. అయితే ఇటీవల రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే సమయంలో.. ఇలాంటి వార్తలే ప్రసారమయ్యాయి. అప్పట్లో ఈ వార్తలను రోహిత్ అభిమానులు ఖండించినప్పటికీ.. అంతిమంగా మాత్రం అదే జరిగింది. అంటే ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.