India 1,798 runs lead England tour : సుదీర్ఘ ఫార్మాట్లో గత కొంతకాలంగా భారత జట్టు ప్రదర్శన గొప్పగా లేదు.. అయితే ఈసారి దానికి చరమగీతం పాడాలని గిల్ ఆధ్వర్యంలో బృందం భావిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లీష్ గడ్డమీద సత్తా చూపించాలని భావిస్తోంది. అయితే జట్టు ఒకటి అనుకుంటే.. ఒక ఆటగాడు మాత్రం మరో విధంగా చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసి జట్టులో కలవరం మొదలైంది. ఆటగాడు 2023 -25 సీజన్ లో 52.88 సగటుతో ఏకంగా 1798 రన్స్ సాధించాడు. అయినప్పటికీ అతడు ఇంగ్లీష్ దేశంలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 20 నుంచి గిల్ సేన ఇంగ్లీష్ జట్టు తలపడుతుంది. 2025 -27 డబ్ల్యూటీసీ సీజన్ ఈ సిరీస్ నుంచి మొదలవుతుంది. అందువల్లే ఈ సిరీస్ అటు భారత జట్టుకు.. ఇటు ఆంగ్ల జట్టుకు అత్యంత ముఖ్యమైనది. ఈ రెండు జట్లు కూడా తమలో ఉన్న లోపాలను సవరించుకొని.. మెరుగైన ఆట తీరును ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే టీమిండియాలో మాత్రం ఒక లోపం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇది జైస్వాల్ రూపంలో గిల్ సేనను కలవరపాటుకు గురిచేస్తోంది.
గిల్ ఓపెనింగ్ బ్యాటర్. అయితే అతడు పరుగులు చేయడంలో తీవ్రంగా అవస్థలు పడుతున్నాడు. ఇటీవల ఇంగ్లీష్ జట్టుతో జరిగిన నాలుగు ఇన్నింగ్స్ లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. మిగతా మూడు ఇన్నింగ్స్ లలో అతడు 30 కి లోపు రన్స్ మాత్రమే చేశాడు. అతని నిరాశ జనకమైన ఫామ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత ఓపెనర్ల మీద ఉంది. వారు కనుక ఒత్తిడి గురైతే మిడిల్ ఆర్డర్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. పైగా ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ అత్యంత ముఖ్యమైనది. అందువల్లే జైస్వాల్ ఈ సిరీస్ లో రాణించాల్సి ఉంది. జైస్వాల్ 2023లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లోకి ప్రవేశించాడు.. తొలి మ్యాచ్లో శతకం చేసి ఆకట్టుకున్నాడు.. అతడు ఆ మ్యాచ్లో 171 రన్స్ చేశాడు. ఇంకా అప్పటినుంచి అతడు పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు 19 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అతడు 1798 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, పది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇతడు రెండు ద్వి శతకాలు కూడా చేశాడు. అయితే అటువంటి ఆటగాడు ఇప్పుడు అనధికారిక టెస్టులలో విఫలం కావడం ఇబ్బందికరంగా మారింది.
Also Read : ఐపీఎల్ లో దుమ్మురేపారు.. ఈ ఐదుగురు టీమిండియాలోకి రావడం ఇక లాంచనమే.
ముఖ్యంగా ఆఫ్ స్టంప్ బంతులను ఆడటంలో జైస్వాల్ ఇబ్బంది పడుతున్నాడు. ఆ బంతులను ఆడలేక విఫలమయ్యాడు. అందువల్లే అతని మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ లోపాలను సవరించుకుంటేనే అతడు ఇంగ్లీష్ జట్టు మీద రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ బౌలర్లు అదే దిశలో బంతులను ఎక్కువగా వేస్తూ ఉంటారు.. ఆ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే యశస్వి నిలబడగలడు. జట్టును నిలబెట్ట గలడు.