Wimbledon Final Indian Celebrities: టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ పోటీలు చాలా ఉన్నప్పటికీ.. వింబుల్డన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వింబుల్డన్ నిర్వహణ.. పోటీపడే ప్లేయర్లు.. వచ్చే ప్రేక్షకులు.. ఆ వాతావరణం మాత్రం భలే ఉంటుంది. పచ్చని పచ్చిక పై బంతితో ప్లేయర్లు హోరాహోరీగా పోరాడుతుంటే.. అది ఒక సంగ్రామం లాగా కనిపిస్తుంది.. అలాంటి మ్యాచ్ లు అత్యంత పగడ్బందీ వాతావరణం మధ్య.. కట్టుదిట్టమైన క్రమశిక్షణ మధ్య జరుగుతుంటాయి. ఈ మ్యాచ్లు చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు.. అయితే వింబుల్డన్ టోర్నీ నిర్వహణ తీరు పకడ్బందీగా ఉంటుంది. అత్యంత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య సాగుతూ ఉంటుంది.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
వింబుల్డన్ పోటీలు చూసేందుకు మన దేశం నుంచి కూడా సెలబ్రిటీలు వెళ్తుంటారు. వారిలో సచిన్, విరాట్, రోహిత్, ఇతర ప్రముఖులు ముందు వరుసలో ఉంటారు. వాస్తవానికి వింబుల్డన్ పోటీలను చూసేందుకు వెళ్లేవారు జాబితాలో ఇండియన్ సెలబ్రిటీలు ప్రైమ్ కేటగిరీలో ఉంటారు.. అయితే వారు వెళ్ళేది కేవలం పోటీలు చూసేందుకు మాత్రమే కాదు.. దాని వెనుక వందల కోట్ల వ్యాపారం ఉంది. వాస్తవానికి టెన్నిస్ ఆడే ప్లేయర్లు మాత్రమే వివిధ కంపెనీలకు ప్రచారం చేస్తారని అనుకుంటారు. అది నిజం కూడా. కాకపోతే ఇండియన్ సెలబ్రిటీలు వింబుల్డన్ పోటీలు చూసేందుకు వెళ్లి ఆయా కంపెనీలకు ప్రచారం జరుపుతారు.
సెలబ్రిటీలుగా ఉన్నవారు ఆయా కంపెనీలు రూపొందించిన దుస్తులు మాత్రమే ధరిస్తారు. టెన్నిస్ అనేది సంపన్న ప్రజలు ఆడే క్రీడ కాబట్టి.. భారత సెలబ్రిటీలు కచ్చితంగా సూటు బూటు ధరించి వెళ్తారు. ఒకరకంగా ఫ్యాషన్ కంపెనీలకు ప్రమోషన్ నిర్వహిస్తారు. ఇటువంటి పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతున్నప్పుడు తమ బ్రాండ్ దుస్తులు ధరించి వెళ్తే అమ్మకాలు 400 శాతం వరకు పెరుగుతాయని కంపెనీలు భావిస్తుంటాయి. ఇది గ్లోబల్ పరంగా బూస్ట్ ఇస్తుందని ఆ కంపెనీలో నమ్ముతుంటాయి. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వాటి ప్లేయర్లు టాప్ క్లాస్ కంపెనీల దుస్తులు మాత్రమే ధరిస్తుంటారు.. తద్వారా గ్లోబల్ ప్రమోషన్ నిర్వహిస్తుంటారు. ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లను సైతం ఆకర్షిస్తుంటారు. వింబుల్డన్ పోటీలు చూసేందుకు మన దేశానికి చెందిన వివిధ కంపెనీల సీఈవోలు కూడా హాజరవుతుంటారు. ఆ సమయంలో కోలాబ్రేషన్స్, స్ట్రాటజిక్ డీల్స్ కుదుర్చుకుంటారు. అయితే ఇవన్నీ కూడా వందల కోట్ల వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. వీరందరూ కూడా వింబుల్డన్ టోర్నీని పెంచుకోవడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మీడియా కవరేజ్ ఇస్తుంది. 2027 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదుగుతుంది. పైగా గ్లోబల్ బ్రాండ్లు తమ తదుపరి వ్యాపార గమ్యస్థానంగా భారతదేశాన్ని ఎంచుకోవాలనేది వివిధ కంపెనీల అభిమతం. అందువల్లే ఈ మెగా టెన్నిస్ టోర్నీ ద్వారా భారత సీఈవోలు ప్రచారం చేస్తుంటారు.
మనదేశం నుంచి క్రికెటర్లు మాత్రమే కాకుండా.. సినీ తారలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, అనుష్క శర్మ, ఇతర సెలబ్రిటీలు కూడా వింబుల్డన్ పోటీలకు హాజరవుతుంటారు. దాదాపు కొద్దిరోజుల వరకు వారు అక్కడే ఉంటారు. ఇదే సమయంలో పలు కంపెనీలకు వారు ప్రచారం నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇన్వెస్టర్లతో భేటీ కూడా అవుతుంటారు. తద్వారా గ్లోబల్ ప్రమోషన్ మాత్రమే కాకుండా.. ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడానికి వారు కారణమవుతారు. వింబుల్డన్ పోటీలకు గ్లోబల్ మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తుంది. అందువల్లే మన దేశం నుంచి సెలబ్రిటీలు అక్కడికి వెళుతుంటారు. పైగా రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం లభిస్తుంది. అందువల్లే వారు ఈ మెగా టోర్నీని ఎంచుకుంటారు. ముఖ్యంగా ఫ్యాషన్ దుస్తులు తయారుచేసే సంస్థల సీఈవోలు ఈ పోటీలకు ఎక్కువగా హాజరవుతుంటారు. పైగా ఈ పోటీలకు వచ్చే వారంతా కూడా శ్రీమంతుడు కావడంతో ఆయా కంపెనీల లావాదేవీలు మరింత వేగంగా జరుగుతుంటాయి. రోలెక్స్, ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్, ట్యాగ్ హియర్, డాల్స్ గబ్బాన వంటి ప్రఖ్యాత కంపెనీలు వింబుల్డన్ టోర్నీకి ప్రధాన ప్రయోజకకర్తలుగా ఉన్నాయి.
View this post on Instagram