Kinetic Bike: ప్రస్తుతం ద్విచక్రవాహనాల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వేరియంట్ లే ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. రానున్న 5 సంవత్సరాల్లో 70 శాతం వరకు ఈవీలే వినియోగించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా చాలా కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఒక్కొక్కటి కాకుండా ఏకంగా రెండు నుంచి మూడు మోడళ్లు తీసుకొచ్చి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తున్నాయి. టూవీలర్ లో కైనెటిక్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కంపెనీకి చెంది ఈ వాహనం ఇప్పుడు కొత్తగా ఆకర్షించే విధంగా మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాల్లోకి వెళితె..
ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే మిగతా కంపెనీల కంటే ముందుగానే కైనెటిక్ గ్రీన్ అనే కంపెనీ భారత మార్కెట్లో తన సత్తా చాటేందుకు ఆకర్షణీయమైన వాహనాలను తీసుకురావాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీకి చెందిన కైనెటిక్ హోండా DX ను పరిచయం చేయబోతుంది. ఈ వాహనం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఫ్యామిలీ అవసరాలకు ఉపయోగపడనుంది. మంచి డిజైన్ ను కలిగి ఉన్న ఇది పూర్తిగా లేటేస్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అలాగే ఈ వాహనం టీఎఫ్ టీ డిజిటల్ డిస్ ప్లే, ఎల్ వోటీ కనెక్టివిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సాంప్రదాయాన్ని కొనసాగించేలా ఉన్న ఈ స్కూటర్ లో రిమోట్ స్టార్టింగ్ ఆప్షన్ ను చేర్చారు. అలాగే ఫాస్ట్ గా ఛార్జింగ్ కావడానికి స్మార్ట్ ఫీచర్లను జోడించారు. ఒక్కసారిగా దీనిని ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే ఈ వాహనం స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయెల్ రియర్ షాకబ్జాలు ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తో పనిచేసే ఇందులో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చారు.
కెనైటిక్ సంస్థ ఇప్పటి వరకు 80 వేలకు పైగా వాహనాలను విక్రయించింది. అయితే కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ వాహనాలు కూడా ఎక్కువగా సేల్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న కాలంలో ఈవీల వాహనాల విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నందున.. కైనెటిక్ వాహనాలపై మక్కువ పెంచుకుంటారని అంటున్నారు. అయితే ఈ వాహనాల ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కానీ వీటిని ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి తీసుకొస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వాహనాలకు సంబంధించిన కొన్ని పిక్స్ అలరిస్తున్నాయి.