MS Dhoni: ధోనీ కొట్టిన ఐసీసీ ట్రోఫీనే చివరిది… ఈసారైనా కప్పు కొడతారా.. లేదా..?

ఇప్పుడు వరుసగా మనవాళ్లు ఏషియా కప్,ఆస్ట్రేలియా సీరీస్ లు గెలుచుకున్నప్పటికీ వరల్డ్ కప్ లో ఎంత మేరకు రాణిస్తారు అనే దానిమీద ఇప్పుడు చాలా రకాల చర్చలు మాత్రం జరుగుతున్నాయి.

Written By: Neelambaram, Updated On : October 2, 2023 11:09 am
Follow us on

MS Dhoni: ఇండియాలో క్రికెట్ అంటే ప్రతి అభిమాని కూడా చాలా ఆసక్తి చూపిస్తూ మ్యాచ్ ఆడడానికి కానీ, టీవీలో మ్యాచులు చూడడానికి గాని ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు.ఇక ఇండియాలో క్రికెట్ ని మించిన స్పోర్ట్స్ మరొకటి లేదు. అందరూ క్రికెట్ ని చూస్తారు, క్రికెట్ ఆడతారు దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ క్రికెట్ వ్యవస్థలో ఇండియానే టాప్ స్థాయిలో ఉందనే చెప్పాలి. ఐసీసీకి అత్యంత రెవెన్యూ జనరేట్ చేసే క్రికెట్ టీం కూడా మన ఇండియా టీమే కావడం విశేషం…ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఇండియా బోర్డ్ ఒక మార్గదర్శకంగా తయారయింది. మూడు ఫార్మాట్ లలో ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్న ఇండియా టీమ్…ఇప్పుడు ప్రపంచం లోని చాలా దేశాల క్రికెట్ అభిమానులకు సైతం ఫేవరెట్ గా నిలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇంకో నాలుగు రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో ప్రస్తుతం ఇండియా టీం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

ఇప్పుడు వరుసగా మనవాళ్లు ఏషియా కప్,ఆస్ట్రేలియా సీరీస్ లు గెలుచుకున్నప్పటికీ వరల్డ్ కప్ లో ఎంత మేరకు రాణిస్తారు అనే దానిమీద ఇప్పుడు చాలా రకాల చర్చలు మాత్రం జరుగుతున్నాయి.మన ప్లేయర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ తీరా సమయానికి వాళ్ళ పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ అందరినీ కలిచి వేస్తున్న అంశం అనే చెప్పాలి… ఎందుకంటే ఇండియా నార్మల్ గా వేరే దేశాల మీద ఆడే సిరీస్ లని గెలుస్తుంది.కానీ ఐసీసీ నిర్వహించే ఒక ట్రోఫీని కూడా గెలకాలేకపోయింది.ఇక ఇండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలుచుకోలేకపోయింది. దాదాపు 10 సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క కప్పు కూడా ఇండియా గెలవకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసే అంశం అనే చెప్పాలి. అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చే ఇండియా టీం చివరి వరకు వచ్చి కప్పును చేజార్చుకుంటూ పోతుంది గత వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ మీద సెమీఫైనల్ లో ఓడిపోయి వెను తిరగాల్సి వచ్చింది. జడేజాకి తోడు ఒక ప్లేయర్ ఎవరైనా ఆ మ్యాచ్ తోడు గా ఉంటే ఆ మ్యాచ్ ఈజీగా గెలిచేది, కానీ చివరి నిమిషంలో అందరూ తడబడ్డారు. దానికి తోడు ధోని కూడా రన్ అవుట్ అవ్వడంతో ఆ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది…

ఇక అంతకు ముందు 2014 టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక చేతిలో పోరాడి ఓడిపోవలసి వచ్చింది, అలాగే 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో సెమీఫైనల్ లో ఓడిపోయింది, 2016 t20 వరల్డ్ కప్ లో సెమిస్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది…2017 లో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మీద ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది, 2019 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది,ఇక 2021 టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే వెను తిరిగింది. అలాగే 2022 టి 20 వరల్డ్ కప్ సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ మీద ఓడిపోయింది. ఇలా వరుసగా ట్రోఫీలకి దగ్గరిగా వచ్చి ఇండియా ఓడిపోవడం చూసిన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.ఇక ఈ సారైనా జాగ్రత్తగా ఆడి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ కూడా సాధించి పెడతారని ఆశతో అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు…