https://oktelugu.com/

Pawan Kalyan: జనసేన- టిడిపి గెలుపు పై పవన్ ఫుల్ కాన్ఫిడెన్స్.. కారణం ఇదీ

2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని పవన్ గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని భావిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 2, 2023 / 11:35 AM IST
    Follow us on

    Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లే వస్తాయా? పవన్ వద్ద అంత స్పష్టమైన సమాచారం ఉందా? ఇప్పటికే సర్వే చేసుకున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి చూస్తే వై నాట్ 175 అంటుంది. అటు ఇటు అయినా కచ్చితంగా అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తోంది. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకుంది. కానీ పవన్ మాత్రం 15 సీట్లకు మించి రావని తేల్చి చెబుతున్నారు. అంటే జనసేన, టిడిపి కూటమికి 160 సీట్లు వచ్చే అవకాశం ఉందని పవన్ చెప్పడం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    ఏపీలో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దానిని సంక్షేమ పథకాలతో అధిగమిస్తామని వైసీపీ భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు సైతం భయపడుతున్నారు. తాను బటన్ నొక్కి.. తమను ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పడం ఏమిటని వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. పైగా తమను ఐపాక్ టీం, నిఘవర్గాలు వెంటాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అటు సర్వే నివేదికలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పై స్పష్టమైన వ్యతిరేకత ఉందే తప్ప.. తమపై లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ తప్పు తమపై చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

    2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని పవన్ గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని భావిస్తున్నారు. ముందుగా రెండు పార్టీల మధ్య ఓట్లు, సీట్లు సక్రమంగా బదలాయింపు జరిగే బాధ్యతను పవన్ తీసుకున్నారు. అటు జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబులను రంగంలోకి దించారు. టిడిపి తో సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు తాజాగా వారాహి యాత్రలో సైతం స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈసారి జనసేన టిడిపి కూటమికి అండగా నిలవాలని కోరుతున్నారు.

    అయితే పవన్ ఈ తరహా ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి. సర్వేల ఫలితాలను అనుసరించే పవన్ ఇలా ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది. పవన్ ఈనాడు ఇన్ని సీట్లు గెలిచేస్తాం. అధికారంలోకి వచ్చేస్తాం అని ధీమా కనబరచలేదు. కానీ వైసీపీ 15 సీట్లకే పరిమితమవుతుందని.. కూటమికి 160 సీట్లు లభిస్తాయని చెప్పడం విశేషం. సర్వే పక్కా లెక్కల తోనే పవన్ ప్రకటించి ఉంటారని జన సైనికులు నమ్మకంగా చెబుతున్నారు. అధినేత నోటి నుంచి ఆ మాట వస్తుండడంతో సంబరపడుతున్నారు. అయితే తాజాగా పవన్ ఇతర ప్రకటనలతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.