Homeక్రీడలుక్రికెట్‌India Vs Pakistan: పాక్ తో అమీ తుమీ కాదు.. ఈసారి అంతకుమించి.. టీమిండియా 2.0...

India Vs Pakistan: పాక్ తో అమీ తుమీ కాదు.. ఈసారి అంతకుమించి.. టీమిండియా 2.0 లోడింగ్.. చూసేందుకు మీరు సిద్ధమా?

India Vs Pakistan: పాకిస్తాన్ మనకు చిరకాల ప్రత్యర్థి. గతంలో పాకిస్తాన్ జట్టు తో మ్యాచ్ జరిగినప్పుడు ఉత్కంఠ ఒక స్థాయి వరకే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సిందూర్ జరిగిందో.. ఆ తర్వాతే పాకిస్తాన్ మీద టీమిండియా తీవ్రంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆసియా కప్ లో అయితే దారుణంగా ఓడించింది. అంతకుముందు కూడా వన్డే వరల్డ్ కప్.. టీ 20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రతి మేజర్ టోర్నీలో పాకిస్తాన్ మీద భారత్ అద్భుతమైన గెలుపును అందుకుంది.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో ఆడబోనని పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి ఆడేందుకు పాకిస్తాన్ ఒప్పుకుంది. దీంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమం అయింది.

సాధారణంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఈసారి అది మరింత పెరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ తలపడినప్పుడు ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ వైపే చూస్తుంది. ఎందుకంటే రెండు జట్ల మధ్య జరిగే పోరాటం ఎప్పటికీ ఉత్కంఠ గానే ఉంటుంది కాబట్టి.. చాలామంది ప్రేక్షకులకు దానిని ఆస్వాదించడం ఇష్టం. అందుకే ఈ రెండు జట్లు పోటీ పడుతుంటే చూస్తుంటారు.

పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే టీమ్ ఇండియా ప్లేయర్లు రెచ్చిపోతారు. ఘనమైన రికార్డును పదిల పరుచుకోవాలని చూస్తుంటారు. మరోవైపు ఇటీవల పాకిస్తాన్ జట్టు ఫామ్ లోకి వచ్చేసింది. నెదర్లాండ్స్ జట్టుతో ఇబ్బంది పడినప్పటికీ.. అంతకుముందు స్వదేశంలో జరిగిన టి20 సిరీస్లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ మట్టి కరిపించింది.

కసి తో ఆడాలని.. భారత జట్టును దెబ్బతీయాలని పాకిస్తాన్ భావిస్తోంది.. ఫలితంగా ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే గత రికార్డులు కూడా టీమిండియా స్థాయి ఏమిటో నిరూపిస్తున్నాయి. సరిగ్గా కొద్ది నెలల క్రితం ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. మూడుసార్లు పాకిస్తాన్ పోటీ పడినప్పటికీ.. ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ సేన అదే స్థాయిలో ఆడుతుందని.. పాకిస్తాన్ చట్టం బోధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అభిషేక్ ఆడటం ఖాయం కావడంతో.. సంజు శాంసన్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్య అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి వారు సత్తా చూపిస్తే టీమిండియాకు ఇక తిరుగు ఉండదు. ఇటీవల మ్యాచులలో టీమిండియా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ చేయాలని.. భారీగా పరుగులు చేసి పాకిస్తాన్ జట్టు చుక్కలు చూపించాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు.

తుది జట్ల అంచనా

అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, రింకు సింగ్, శివం దుబే.

పాకిస్తాన్

ఫర్హాన్, సల్మాన్ ఆఘా, అయూబ్, బాబర్, షాదాబ్, నవాజ్/ సల్మా మీర్జా, ఫహిమ్, షహీన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version