Bill Gates: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ( Microsoft chief Bill Gates) ఏపీకి రానున్నారు. ఈనెల 16న ఆయన తన బృందంతో పర్యటించనున్నారు. తన గేట్స్ ఫౌండేషన్ తరపున రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు తో బేటి కానున్నారు. బిల్ గేట్స్ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంజీవిని పథకం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టును సైతం బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు ఆయన ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్నారు.
* సన్నిహిత సంబంధాలు..
బిల్ గేట్స్ తో చంద్రబాబుకు( AP CM Chandrababu) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్ గేట్స్ ను కలిసేందుకు సమయం కోరారు. అయితే అతి కొద్ది సమయం మాత్రమే ఇచ్చారు బిల్ గేట్స్. అప్పట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గేట్స్ ను మెప్పించారు చంద్రబాబు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఏర్పాటులో ముందడుగు పడింది అప్పుడే. మైక్రోసాఫ్ట్ ఏర్పాటు అయిన తర్వాత దిగజా ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్ వచ్చాయి. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది. చంద్రబాబుకు మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు బిల్ గేట్స్ ముందుకు రావడం శుభ పరిణామం. బిల్ గేట్స్ అమరావతి పర్యటనతో అనేక కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి. పెట్టుబడులకు సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది.
* షెడ్యూల్ ఇది..
బిల్ గేట్స్ బృందం సోమవారం ఉదయం పది గంటలకు అమరావతిలోని( Amravati capital ) రాష్ట్ర సచివాలయానికి రానుంది. అక్కడి ఆర్ టి జి ఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించునున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించుతున్నారు. అనంతరం బిల్ గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశం అవుతారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్ టెక్, దయాగ్నస్టిక్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు గేట్స్ వివరిస్తారు. మరోవైపు అమరావతి లోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళనున్నారు గేట్స్. అక్కడ డ్రోన్లు,, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వచ్చే పట్టే సాగు విధానాన్ని పరిశీలించనున్నారు. ఇది బిల్ గేట్స్ పర్యటన షెడ్యూల్.