Homeఎంటర్టైన్మెంట్Tarun Bhaskar Eesha Rebba: మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన తరుణ్ భాస్కర్ - ఈషా...

Tarun Bhaskar Eesha Rebba: మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా..వీడియో వైరల్..

Tarun Bhaskar Eesha Rebba: గత కొంత కాలంగా టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా నిల్చిన జంట తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా. వీళ్లిద్దరు చాలా రోజుల నుండి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని , ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తరుణ్ భాస్కర్ కానీ , ఇటు ఈషా రెబ్బా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి కనిపిస్తూ మీడియా కి తాము నిజంగానే డేటింగ్ చేస్తున్నామని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక నేడు వీళ్లిద్దరు హైదరాబాద్ విమానాశ్రయం లో కలిసి నడుస్తూ కనిపించడంతో మరోసారి వీళ్లిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ , ఒక ఇంటర్వ్యూ లో మాత్రం ఈషా రెబ్బా గురించి తరుణ్ భాస్కర్ గొప్పగా చెప్పుకొచ్చారు.

తనకు ఈషా రెబ్బా స్నేహితురాలికంటే చాలా ఎక్కువ అని , తన జీవితం అతి ముఖ్యమైన వ్యక్తి అని , సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయం పై మాట్లాడుతానని చెప్పుకొచ్చారు తరుణ్ భాస్కర్. ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అన్నారంటే , కచ్చితంగా తన కాబోయే భార్య అని అర్థం. విజయ్ దేవరకొండ , రష్మిక జంట లాగా , ఎందుకు ఇంకా నాన్చడం , అధికారికంగా చెప్పేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ వీళ్ళ రిలేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గానే హీరో హీరోయిన్లు గా ‘ఓం శాంతి శాంతి శాంతిః ‘ అనే చిత్రం లో నటించారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి ఇది రీమేక్.

జనవరి 30 వ తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందే వీళ్లిద్దరి మధ్య లవ్ రిలేషన్ షిప్ ఉంది. అంతకు ముందు వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది మిస్టరీ. ఈ జంటలో ఎవరో ఒకరు చెప్తే కానీ , వీళ్ళ మధ్య పరిచయం ఎలా మొదలైంది , ప్రేమ ఎలా పుట్టింది అనే విషయాలపై క్లారిటీ రాదు. ఇక వీళ్ళ కెరీర్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నాగరినికి ఏమైంది 2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈషా రెబ్బా అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది , ఆమె చేతిలో ఎలాంటి సినిమా కానీ , వెబ్ సిరీస్ కానీ లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version