Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson: సంజు శాంసన్ కెరియర్ ముగిసినట్టేనా..

Sanju Samson: సంజు శాంసన్ కెరియర్ ముగిసినట్టేనా..

Sanju Samson: జింబాబ్వే టూర్ కు టీమిండియా ను ప్రకటించారు. ఇందులో సంజు శాంసన్ కు అవకాశం లభించలేదు. వైభవ్ సూర్య వంశీ.. అభిషేక్ శర్మ.. కిషన్ కిషన్.. అయ్యర్.. తిలక్ వర్మ.. శివం దుబే.. సూర్యాంష్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబే, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మయాంక్ యాదవ్, రింకు సింగ్ వంటి వారికి చోటు లభించింది. జింబాబ్వే టూర్ లో సంజు శాంసన్ కు చోటు లభించకపోవడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంజు కెరియర్ ముగిసిందని.. త్వరలోనే అతడు బ్యాగుల సర్దుకోవాలని కొంతమంది కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి సంజు అద్భుతమైన ఆటగాడు. అతడు కెరియర్ ఇప్పుడు పెద్దగా ఇబ్బందులలో లేదు. ఐర్లాండ్ సిరీస్ లో అతడు విఫలమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్ లోను అంతగా ఆకట్టుకోలేని విషయం కూడా తెలిసిందే. కాకపోతే ఈ మూడు మ్యాచ్ లనే ప్రామాణికంగా తీసుకొని అతడిని తక్కువ చేయడం ఏమాత్రం సరికాదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో అతడు ప్లేయింగ్ 11 జాబితాలో లేడు. చివరికి అతడిని తీసుకొచ్చారు. ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియాను విజేతగా నిలిపాడు. అండర్ డాగ్ లాగా వచ్చి.. సింహం లాగా ఆడి అదరగొట్టాడు.

జింబాబ్వే టూర్ ద్వారా సంజు శాంసన్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ.. వైభవ్ సూర్య వంశీ ఓపెనర్లుగా ఉన్నారు. అలాంటప్పుడు మూడో ఓపెనర్ గా సంజు వెళ్లాల్సిన అవసరం ఏముంది. జింబాబ్వే టూర్ తర్వాత సెప్టెంబర్ నెలలో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. అది అత్యంత కీలకమైంది. పైగా ఆ టోర్నీకి సంజు ఎంపికయ్యాడు. అలాంటప్పుడు సంజుకు మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇవ్వలేదు అని అనడంలో అర్థం ఏముంది. ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమయ్యాడు కాబట్టి.. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్ లోను అదరగొట్టలేదు కాబట్టి.. అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అలాగని అతడిని తొలగించినట్టు కాదు. విఫలమవుతున్నాడు కాబట్టి తన ఆట తీరు మార్చుకోవాలని అవకాశం ఇచ్చింది. కేవలం సంజుకే కాదు.. ఎంతటి ఆటగాడు అయినా సరే కొన్ని సందర్భాలలో బ్యాడ్ ఫేస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి సంజు మినహాయింపు కాదు. అంతటి సచిన్ కూడా ఒక సందర్భంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సంజు కూడా అలాంటి వాడే.. ఆ మాత్రం దానికి లేనిపోని విమర్శలు చేసి.. అతడి కెరియర్ ముగిసింది అని చెప్పడం సబబు కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version