Homeక్రీడలుCristiano Ronaldo Retirement: వీ మిస్ యూ రోనాల్డో.. గుండె పలిగింది.. ఇలాంటి వీడ్కోలు కల్లో...

Cristiano Ronaldo Retirement: వీ మిస్ యూ రోనాల్డో.. గుండె పలిగింది.. ఇలాంటి వీడ్కోలు కల్లో ఊహించలేదు..

Cristiano Ronaldo Retirement: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఒక ఆటగాడికి ఇలాంటి వీడ్కోలు దక్కడం హృదయ విదారకం.. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే ఒక సువర్ణమైన ఆటగాడిగా.. అనితర సాధ్యమైన రికార్డులు సాధించిన యోధుడిగా పోర్చుగీసు జట్టు ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకు పేరుంది. ప్రస్తుత ఫిఫా కప్ లో కూడా అతడు అదరగొట్టాడు. కానీ.. ఈసారి అదృష్టం అతడి వెంట లేదు. ఫలితంగా అతడు కన్న కలలు నెరవేరలేదు. అతడి జట్టు కీలక దశలో గెలవలేదు. ఫలితంగా సగటు ఫుట్ బాల్ అభిమాని గుండె పగిలింది. కన్నీరు మిగిలింది.

తన కెరియర్ చివరి ఫిఫా కప్ కావడంతో రోనాల్డో తన జట్టుకు ట్రోఫీ అందించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవాలని అనుకున్నాడు. 41 సంవత్సరాల వయసులోనూ.. శరీరం సహకరించకపోయినప్పటికీ.. తన దేశం కోసం రోనాల్డో చివరిదాకా పోరాడాడు. కానీ ఆ కల సాకారం కాలేదు. నెరవేరని కలతో ఫుట్ బాల్ నుంచి నిష్క్రమించాడు.

రోనాల్డో మైదానంలో చిరుత పులి మాదిరిగా దూసుకుపోయేవాడు. తన పాదాలతో వేగంగా పరుగులు పెట్టేవాడు.. కాలంతో పోటీపడి తన జట్టుకు విజయాలు అందించాడు. అటువంటి రోనాల్డో తన కథను ముగించాడు. స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. నాకు ఇదే చివరి ఫిఫా కప్ అని రోనాల్డో ప్రకటించాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు తన జట్టుకు విజయాలు అందించాడు. అతి కీలకమైన మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో.. రోనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలోనే కూర్చొని భావోద్వేగానికి గురయ్యాడు.. ఈ మ్యాచ్లో స్పెయిన్ తరఫున మైకేల్ మెరీనో గోల్ కొట్టాడు. ఈ విజయం ద్వారా స్పెయిన్ ఏకంగా క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్ళింది స్పెయిన్ 2010లో ప్రపంచ కప్ టైటిల్ అందుకుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.

ఫుట్ బాల్ కు గుడ్ బై చెప్పడంతో రోనాల్డో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వీ మిస్ యు రోనాల్డో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. రోనాల్డో ఆధునిక ఫుట్బాల్ చరిత్రలో అత్యధికంగా అధికారిక గోల్స్ చేసిన ఆటగాడు. ఇతడి ఖాతాలో 900+ గోల్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా.. ఇటలీ.. ఇంగ్లాండ్.. స్పెయిన్ వంటి భిన్నమైన లీగ్లలో అతడు సత్తా చూపించాడు. భిన్నమైన పరిస్థితుల్లో అదరగొట్టాడు. యు ఎఫ్ ఎఫ్ చాంపియన్స్ లీగ్ టైటిళ్లను ఐదుసార్లు సొంతం చేసుకున్న చరిత్ర అతడిది. ఇతడిని ఛాంపియన్ లీగ్ చక్రవర్తి అని పిలుస్తుంటారు.

పోర్చుగల్ జట్టు కోసం యూఈఎఫ్ఏ యూరో 2016, యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్స్ అందించిన చరిత్ర ఇతడికి ఉంది.. ఇతడు కేవలం పోర్చుగల్ జట్టుకు మాత్రమే పరిమితమైన ఆటగాడు కాదు. ఎందుకంటే ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడు మైదానాన్ని వీడి వెళ్ళిపోతుంటే స్పెయిన్ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది రొనాల్డో అంటే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version