spot_img
Homeక్రీడలుIndia Vs New Zealand Semi Final: 5.1 కోట్ల వ్యూస్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త...

India Vs New Zealand Semi Final: 5.1 కోట్ల వ్యూస్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు

India Vs New Zealand Semi Final: అసలే మన దేశంలో క్రికెట్‌ అంటే బడికెళ్లే పిల్లల నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకు యమా పిచ్చి. మైదానంలో ముఖ్యంగా భారత ఆటగాళ్లు సిక్స్‌లు, ఫోర్లు కొడుతుంటే అభిమానులు కేరింతలు కొడతారు. టీవీలో లైవ్‌ వస్తుంటే కళ్లు అప్పగించుకుని చూస్తుంటారు. అభిమాన క్రికెటర్లను దైవాంశసంభూతులుగా కొలుస్తుంటారు. అలాంటిది మనదేశంలో వరల్డ్‌ కప్‌ జరుగుతుంటే ఊరుకోరు కదా! భారత్‌ జట్టు మాత్రమే ఇతర జట్లు ఆడే మ్యాచ్‌లను సైతం మిస్‌ కాకుండా చూశారు. ఇక భారత్‌ వరుసగా 9 విజయాలు సాధించి సెమిస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం ముంబయిలోని వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో సెమీస్‌ పోరులో తలపడుతోంది. భారత బ్యాటర్లు విజృంభించడంతో భారీ స్కోరుదిశగా పయనిస్తోంది.

వ్యూస్‌ ల్లో రికార్డు

సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కావడం, అందునా సొంత దేశంలో సొంత టీం ఆడుతుండటంతో వాంఖడే మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. డేవిడ్‌ బెక్‌ హమ్‌, సచిన్‌ లాంటి ఆటగాళ్లు మ్యాచ్‌ చూసేందుకువచ్చారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. మరోమాటకు తావులాంకుండా దూకుడైన ఆటను ప్రదర్శించింది. విరాట్‌ తన 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్‌ రికార్డును అధిగమించాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా తక్కువ బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ వ్యూస్‌ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. వరల్డ్‌ కప్‌ సీరిస్‌ మొత్తాన్ని ఎటువంటి సబ్‌ స్ర్కిప్షన్‌ వసూలు చేయకూడదని డిస్ని ప్లస్‌ హాట్‌ స్టార్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ఫలితమే సరికొత్త రికార్డులను నమోదు చేసేందుకు కారణమైంది.

5.1 కోట్లు

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడం, మన దేశం సెమీస్‌కు వెళ్లడం, చేతిలో అపరిమితమైన డాటా ఉండటంతో అభిమానులు సెల్‌ ఫోన్లకు అతుక్కుపోయారు. ఫలితంగా లైవ్‌ వ్యూయర్స్‌ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 5.1 కోట్లకు చేరుకుంది. గతంలో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను 3 కోట్ల మంది చూడగా, ఇప్పుడు భారత్‌- న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది. వ్యూస్‌ ఫరంగా జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ అయిన ఫుట్‌ బాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను సైతం ఈ మ్యాచ్‌ అధిగమించింది. రికార్డు స్థాయిలో వ్యూయర్‌ షిప్‌ నమోదుకావడంతో డిస్ని ప్లస్‌ హాట్‌ స్టార్‌ పండగ చేసుకుంటోంది. యాడ్స్‌ ఎండార్స్‌ మెంట్స్‌తో కోట్లు వెనకేసుకుంటోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version