Virat Kohli: ఒక ప్రపంచకప్ లో 700 పరుగులు చేసిన ఒకే ఒక్కడు మన కోహ్లీనే…

అనుకున్నట్టుగానే ఇండియాన్ ప్లేయర్లు బ్యాట్ తో బీభత్సం సృష్టించారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకొని ఇండియన్ టీమ్ మంచి పని చేసిందంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Written By: Gopi, Updated On : November 15, 2023 6:11 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సెమీ ఫైనల్ లో ఇండియన్ టీమ్ అద్బుతం గా ఆడుతు ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం ని ఆపే దమ్ము న్యూజిలాండ్ బౌలర్లకు లేదు అని ఒకానొక స్టేజిలో వాళ్ళు తెలుసుకొని మన ప్లేయర్లు చేసే విధ్వంసాన్ని చూసి తట్టుకోలేకపోయారు…వచ్చిన ప్లేయరు వచ్చినట్టుగా దుమ్ము దులిపేసారు. ఇక అందులో భాగంగానే వన్డేల్లో కోహ్లీ తన 50 వ సెంచరీ ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక ఇఈ మ్యాచ్ కి ముందు ఇండియన్ టీమ్ ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లి అక్కడ కూడా మన సత్తా చాటాలని అనుకుంది.

అనుకున్నట్టుగానే ఇండియాన్ ప్లేయర్లు బ్యాట్ తో బీభత్సం సృష్టించారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకొని ఇండియన్ టీమ్ మంచి పని చేసిందంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 50 వ సెంచరీ పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయడమే కాకుండా ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ ల్లో కూడా ఒక టోర్నమెంట్ లో ఎవ్వరూ సాధించలేని విధంగా 711 పరుగులను సాధించి కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు…ఇక ఇండియన్ టీమ్ ఫైనల్ కి వెళ్తే ఫైనల్ లో కూడా కోహ్లీ సెంచరీ సాధిస్తే మొత్తం టోర్నీ లో 11 ఇన్నింగ్స్ లల్లోనే కోహ్లీ 800 పరుగులు చేసిన ప్లేయర్ గా ఘన కీర్తి ని అందుకుంటాడు…

అయితే ఇంతకుముందు ఒక టోర్నీ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ పేరు మీద రికార్డ్ ఉండేది. 2003 వ సంవత్సరంలో సౌతాఫ్రికా వేదికగా ఆడిన వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ 11 ఇన్నింగ్స్ లలో 673 పరుగులు చేసి ఒక టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు కోహ్లీ కేవలం 10 ఇన్నింగ్స్ ల్లోనే ఆ రికార్డుని బ్రేక్ చేయడమే కాకుండా వన్డే వరల్డ్ కప్ లో ఒక టోర్నీ లో 700 పరుగులు చేసిన మొదటి ప్లేయర్ గా ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు…

ఇక ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీ చేసి ఈ టోర్నీ లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు.ఇక ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇండియా ఇంత అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇవ్వడం చూస్తున్న ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పడుతున్నాయి.క్రీజ్ లోకి వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా సెంచరీ, హాఫ్ సెంచరీ చేస్తూ విరుచుకు పడ్డారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లకి మాత్రం ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టుగా మన వాళ్లు కొట్టె షాట్లను బిత్తరపోయి చూస్తూ గ్రౌండ్ లో బొమ్మల్లా నిల్చున్నారు….

ఇక న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ ఏ బౌలర్ తో బాల్ వేయించాలి అనే ఓ డైలామా లో పడిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే బౌలర్ ఎవరైనా కూడా ఇండియన్ ప్లేయర్ల దూకుడుని ఆపడంలో మాత్రం చాలావరకు ఇబ్బంది పడ్డారనే చెప్పాలి…ఇక ఇండియన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు సాధించింది…ఇక ఈ భారీ స్కోరు ని మన బౌలర్లు డిఫెన్స్ చేస్తూ అద్భుతమైన బౌలింగ్ కనక చేయగలిగితే ఈ మ్యాచ్ లో ఇండియా చాలా ఈజీగా గెలుస్తుంది…