Virat Kohli 50 Century: సెమీస్ లో కోహ్లీ 50వ సెంచరీ.. సచిన్ రెండు రికార్డులు బ్రేక్..

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకొని అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు ముందుకు దూసుకెళ్తుంది.

Written By: Gopi, Updated On : November 15, 2023 5:23 pm

Virat Kohli 50 Century:

Follow us on

Virat Kohli 50 Century: క్రికెట్ అనే పదానికి అర్థం చెబుతూ బ్యాటింగ్ లో పరుగులు ఎలా కొట్టాలో మెళుకువలు తెలుసుకొని, సెంచరీ చేయడం అంటే అందరికీ కల, కానీ సెంచరీ లు కొట్టడమే వాడి కళ…ఆకాశం నుంచి పుట్టిన పిడుగులా ఒక అద్బుతం, ఉరుమునుంచి వచ్చే మెరుపుల భూమిని బద్దలు కొట్టుకుంటు వచ్చే లావాలా బ్యాట్ తో రికార్డ్ లు స్తృష్టించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఓ వీరుడా (కోహ్లీ) అందుకో మా ఈ వందనాలు…

ఇక వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకొని అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ మంచి నాక్ ఆడాడు. గిల్ కూడా టీమ్ పొజిషన్ చూస్తూ ఆడుతూ వచ్చాడు ఇక 79 పరుగుల వద్ద ఆయన కాలి కండరాలు పట్టడం తో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ఇక అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కోహ్లీ ఇద్దరు కలిసి అద్భుతమైన నాక్ ఆడుతూ పరుగుల వరద పారించారు ఇక ఈ క్రమం లోనే ఒక వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ తన పేరున ఒక అదిరిపోయే రికార్డును కూడ క్రియేట్ చేసుకున్నాడు.

ఇంతకుముందు 2003 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడూ కోహ్లీ ఈ ఇయర్ వరల్డ్ కప్ లో కేవలం పది ఇన్నింగ్స్ ల్లోనే 674 పరుగులు సాధించి ఆ రికార్డును బ్రేక్ చేసి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ బ్యాటింగ్ పవర్ ఏంటో మరొకసారి న్యూజిలాండ్ బౌలర్లకి అర్థమయ్యేలా ఆడుతూ మన ప్లేయర్ల సత్తా ఏంటో మరొకసారి వాళ్ళకి రుచి చూపిస్తున్నారు. 2019 నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ మరి పరుగుల వరద పారిస్తున్నరనే చెప్పాలి…

ఇక కోహ్లీ ఈ మ్యాచ్ లో తన 50వ సెంచరీని పూర్తి చేసుకొని ఇంత వరకు ఈ ప్రపంచం లో ఎవరికి సాధ్యం కానీ విధంగా వన్డేల్లో ఒక అరుదైన రికార్డు ను సాధించాడు. ఇంతకు ముందు వరకు సచిన్ పేరు మీద 49 సెంచరీ లు సాధించిన ప్లేయర్ గా ఉన్న రికార్డ్ ను కోహ్లీ బ్రేక్ చేస్తూ ఈ మ్యాచ్ లో తన 50 వ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు… ఓకే మ్యాచ్ లో సచిన్ సంబంధించిన రెండు రికార్డ్ లను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ అరుదైన ప్లేయర్ గా కీర్తించబడుతున్నాడు…మిగితా ప్లేయర్లు అందరూ ఒక్క సెంచరీ చేయాలంటేనే నానా తంటాలు పడుతుంటే కోహ్లీ మాత్రం అలవోకగా 50 సెంచరీలు చేసి నాకు ఎవరు సాటి లేరు, సాటి రారు అనే విధంగా తన పొటెన్షియల్టిని చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు.