India VS England Test Series : భారత జట్టుకు సంబంధించి సుదీర్ఘ ఫార్మాట్ విషయంలో మేనేజ్మెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా సీనియర్లను పక్కనపెట్టి.. యువ ప్లేయర్లకు అవకాశాలు కల్పించింది. చరిత్రలో తొలిసారిగా యువకుడికి టెస్ట్ పగ్గాలు అప్పగించింది. ఒక రకంగా ఇది అతనికి సవాల్. మేనేజ్మెంట్ కు కూడా ఒక పెద్ద టాస్క్. ఈ టెస్టులో గనక అతడు సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదు. వస్తున్న విమర్శలకు.. ఎదురవుతున్న ఆరోపణలకు గిల్ బలంగా సమాధానం చెప్పినట్టే. అగ్ని పరీక్షలో అతడు సక్సెస్ఫుల్గా బయటపడినట్టే. అయితే ఇంగ్లీష్ గడ్డపై గిల్ సుదీర్ఘ ఫార్మాట్ ఘనతలు ఏమాత్రం పాజిటివ్గా లేవు. చెప్పుకునే స్థాయిలో కూడా లేవు..
Also Read: నిన్నటి దాకా గోట్ లు, హీరోలు.. ఇప్పుడేమో విలన్లు.. పాపం విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్!
ఇంగ్లీష్ గడ్డలో సుదీర్ఘ ఫార్మాట్ నిర్వహించే మైదానాలలో స్వింగ్ అదిరిపోతుంది..సీమ్ చుక్కలు చూపిస్తుంది. ఇలాంటి స్థితిలో ఎంత కాకలు తీరిన ప్లేయర్ అయినా సరే బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. దీనికి గిల్ మినహాయింపు కాదు. గతంలో అతడు ఇంగ్లీష్ గడ్డపై రెండు సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ లు ఆడాడు. 2021లో కివీస్ జట్టుతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్, 2022లో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ లో గిల్ ఆడాడు. ఈ రెండు మ్యాచ్లలో నాలుగు ఇన్నింగ్స్ లలో గిల్ బ్యాటింగ్ చేశాడు. 14.25 సగటుతో అతడు కేవలం 47 రన్స్ మాత్రమే చేశాడు.. గిల్ లాంటి ఎమర్జింగ్ ప్లేయర్ కు ఈ గణాంకాలు ఒక రకంగా దెబ్బ అని చెప్పవచ్చు.. ఇంగ్లీష్ గడ్డపై చెప్పుకోవడానికి సెంచరీ.. కనీసం ఇది నాది అని వివరించడానికి ఒక్క హాఫెన్చరి కూడా గిల్ ఖాతాలో లేదు.. 2021 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 28, సెకండ్ ఇన్నింగ్స్ లో 8 పరుగులు చేశాడు. 2022లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదవ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 17, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫోర్ రన్స్ మాత్రమే చేశాడు.. ఇక జేమ్స్ అండర్సన్, బ్రాడ్ వంటి బౌలర్లను ఎదుర్కోవడంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. స్వింగ్ అవుతున్న బంతిని పదేపదే వేటాడి గిల్ వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఆఫ్ స్టంప్ అవతలపడే బంతులను ఎదుర్కోలేక తలవంచాడు. ఒక రకంగా అది అతడి బలహీనత కూడా.
ఇక మనదేశంలో ఇంగ్లీష్ జట్టుపై గిల్ కు గొప్ప రికార్డు ఉంది. ఇంగ్లీష్ చెట్టు మనతో ఆడిన మ్యాచ్లలో అతడు శతకాలు కొట్టాడు. వడ్డే తరహాలోనే ఆకట్టుకున్నాడు. అయితే ఇంగ్లీష్ గడ్డపైకి పాదం మోపిన తర్వాత గిల్ హాజరు చూపించలేకపోయాడు. ఇక ఇప్పటివరకు ఫారిన్ కంట్రీలలో గిల్ 15 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 28 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. 27.53 యావరేజ్ తో 716 రన్స్ మాత్రమే చేశాడు.. బంగ్లాదేశ్ పై శతకం సాధించిన గిల్.. సఫారీ, కివీస్, ఇంగ్లీష్, కంగారు జట్లపై ఏమాత్రం రాణించలేకపోయాడు. కంగారు గడ్డపై 91 రన్స్ చేసి హైయెస్ట్ స్కోర్ నమోదు చేశాడు.
ఇక సారధిగా ఇంగ్లీష్ గడ్డపై గిల్ అడుగుపెట్టాడు. గతంలో నార్మల్ ప్లేయర్గా అతడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత గిల్ భుజాల మీద ఉంది. అన్నింటికీ మించి ఒత్తిడిని అతడు తగ్గించుకోవాలి. బ్యాటింగ్లో సరికొత్త టెక్నిక్ అవలంబించాలి. ఆఫ్ స్టంప్ అవతలపడే బంతులను వదిలేయాలి. ఇక ప్రస్తుత జట్టులో రోహిత్ లేడు. విరాట్ కోహ్లీ కూడా లేడు. ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారంతా యంగ్ ప్లేయర్లే. మరి వీరిని ఎలా ఉపయోగించుకుంటాడు.. తను ఎలా దారిలో పడతాడు.. ఇంగ్లీష్ గడ్డపై అత్యంత దారుణంగా ఉన్న తన రికార్డును ఎలా సవరించుకుంటాడు.. అనే ప్రశ్నలకు త్వరలోనే గిల్ నుంచి సమాధానాలు రావాల్సి ఉంది. ఒకవేళ వీటన్నిటిని గిల్ కనుక అధిగమిస్తే.. భారత జట్టులో అతడు తిరుగులేని ప్లేయర్ గా, నాయకుడిగా నిలబడతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.