Vizianagaram Wedding: ఏ తల్లిదండ్రుల కైనా వయసుకు వచ్చిన ఆడపిల్లకు కచ్చితంగా పెళ్లి చేస్తారు. ఒక అయ చేతిలో పెట్టి తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఆ తర్వాత కన్నవాళ్ళుగా తమ వంతు సహకారాన్ని.. తమ వంతు బాధ్యతలను పూర్తి చేసుకుంటారు. మన వివాహ వ్యవస్థ ఇంత బలంగా ఉంది కాబట్టే ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
Also Read: వీరికి చుట్టుపక్కన వారితో జాగ్రత్త అవసరం..
రాను రాను మన వివాహ వ్యవస్థ కూడా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రేమలు.. పారిపోవడాలు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడాలు.. వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇటీవల కాలంలో పీటల మీద మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకు లేచిపోవడం వంటి సంఘటనలు పరిపాటిగా మారిపోయాయి. ఇక ఇటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో చోటుచేసుకుంది.. పెళ్లి ముహూర్తాన్ని తల్లిదండ్రులు ఖరారు చేసిన రోజే.. పెళ్లి కుమార్తె తన కుమారుడితో కలిసి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. ఇక ఈ సంఘటన విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించింది.
విజయనగరం జిల్లాలోని వీటి అగ్రహారం అనే ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన ఓ యువతీ పెళ్లీడుకొచ్చింది. ఇంత కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. అయితే ఆ యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో విజయనగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అక్కడ పనిచేస్తున్న ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరు ఒక దగ్గరే పని చేస్తున్న నేపథ్యంలో వారి మనసులు మరింత పెన వేసుకున్నాయి.. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించారు. కాకపోతే ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వ్యవహారం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆమెకుపెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ యువతి మేనమామతో వివాహాన్ని నిశ్చయించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ 5న వివాహం జరగాల్సి ఉంది. విశాఖపట్నం లోని సింహాచలంలో కళ్యాణ క్రతువు పూర్తి కావాల్సి ఉంది. అయితే వివాహానికి ఏర్పాట్లు చేస్తుండగా ఆ యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ సంఘటన కంటే ముందు ఐదు రోజుల క్రితం ఆ యువతిని ప్రేమించిన వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని.. బలవంతంగా ఆమెను మేనమామకు ఇచ్చి వివాహం చేయొద్దని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతడితో గొడవపడ్డారు. అదే కాదు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ.. ఆ యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇద్దరు కూడా మేజర్లు కావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.