Ind Vs Eng T20(1)
IND Vs ENG: ఇంగ్లాండ్, భారత జట్లలో హిట్టర్లకు ఏ మాత్రం కొదవలేదు. ఈ ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ అభిమానుల పరుగుల కరువును తీర్చడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్(Eden gardens) లో బుధవారం తొలి మ్యాచ్ జరుగుతుంది. కోహ్లీ, రోహిత్ టి20 లకు వీడ్కోలు పలికినప్పటికీ సూర్యకుమార్ ఆధ్వర్యంలో టీమ్ మీడియా టి20 ఫార్మాట్లో సంచలన విజయాలు సాధిస్తున్నది. గత ఏడాది టి20 వరల్డ్ కప్ కాకుండా జింబాబ్వే, స్వదేశంలో బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికా పై భారత్ వరుసగా t20 సిరీస్ లు దక్కించుకుంది. వరుస విజయాలతో భారత్ టీ20 ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నవారు. వీరిలో దాదాపు ఎన్ని మందికి భారత్ లో ఆడిన అనుభవం లేదు.
షమీ పైనే ఫోకస్
దాదాపు ఏడాదికి పెంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత మహమ్మద్ షమీ(Mohammed Shami) ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి అడుగుపెడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ గాయపడ్డాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. శస్త్ర చేయించుకున్న అనంతరం మెరుగ్గా రాణించాడు. దేశవాళీ క్రికెట్ ఆడాడు. సెలెక్టర్లను విపరీతంగా ఆకర్షించాడు.. క్రమంలో సెలెక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్, ఛాంపియన్ ట్రోఫీ కి అతడిని ఎంపిక చేశారు. దీంతో అతనికి ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్ అత్యంత ముఖ్యం కానుంది. బుమ్రా(Bhumra)కు గాయం కావడంతో.. అతడి స్థానంలో షమీ ఆడుతున్నాడు.. 2022 t20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆడిన షమీ.. మళ్లీ ఇప్పుడు మైదానంలో బరిలోకి దిగుతున్నాడు. ఇక అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్ హోదాలో ఇదే తొలి మ్యాచ్. గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో అక్షర పటేల్ ఆల్ రౌండర్ హోదాలో అదరగొట్టాడు.. ఇక దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు చేసిన కీపర్ సంజు శాంసన్, తిలక్ వర్మ బీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. అయితే అతడికి తుది జట్టులో స్థానం లభించడం కష్టంగానే ఉంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యాతో కలిసి భారత బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. స్పిన్ మాంత్రికులు అక్షర్ పటేల్, వరుణ్, రవి బిష్ణోయ్ కనుక మంత్రజాలాన్ని పాటిస్తే ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పవు.
ఇంగ్లాండ్ జట్టు ఎలా ఉందంటే..
బజ్ బాల్ గేమ్(Buzz ball game) తో ఇంగ్లాండ్(England) టెస్ట్ క్రికెట్ గతినే మార్చేసిన మెకల్లమ్ కోచింగ్ లో.. కోల్ కతా లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో ఆసక్తికరంగా మారింది..బజ్ బాల్ గేమ్ తో మెకల్లమ్ ఇంగ్లాండ్ జట్టులో సంచలనాలకు నాంది పరికెలా చేశాడు. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ పూర్తిస్థాయిలో జట్టును ప్రకటించింది. బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఓపెన్ అల్ గా దిగే అవకాశం ఉంది. కోల్ కతా జట్టు లో మాజీ ఆటగాడిగా ఉన్న సాల్ట్ కు ఈడెన్ గార్డెన్ పై అవగాహన ఉంది. టోఫ్లే, కర్రాన్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు జట్టులో లేకపోయినప్పటికీ.. ఇంగ్లాండ్ 21 సంవత్సరాల జాకబ్ బేతేల్ పై నమ్మకం పెట్టుకుంది. ఇతడు ఏడు టి20 లు ఆడి 57.66 సగటుతో పరుగులు చేస్తున్నాడు. పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై కూడా పర్యటక ఇంగ్లాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ బట్లర్, బ్రూక్, లివింగ్ స్టోన్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.
తుది జట్లు ఇవే
భారత్
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ.
ఇంగ్లాండ్: బట్లర్(కెప్టెన్), డకెట్, సాల్ట్, బేతెల్, ఓవర్టన్, ఆదిల్ రషీద్, అత్కిన్సన్, ఆర్చర్, మార్క్ వుడ్, బ్రూక్, లివింగ్ స్టోన్.
మ్యాచ్ జరిగే వేదిక: కోల్ కతా, ఈడెన్ గార్డెన్స్ (Kolkata, Eden gardens)
సమయం: బుధవారం, రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
ఎందులో చూడొచ్చంటే: స్టార్ స్పోర్ట్స్ ఛానల్(Star sports channel), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ(Disney Plus hotstar OTT)
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs england t20i series live streaming squads everything you need to know
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com