Ind Vs Eng T20: ఇంగ్లాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియా(India)లో పర్యటిస్తోంది. ఈమేరకు ఇటీవలే భారత్‌కు చేరుకున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ బుధవారం(జనవరి 22న)న జరుగనుంది. ముంబై వేదికగా మొదటి టీ20 జరుగుతుంది. ఐదు మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్ సిరీస్ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లకు భారీగా డుబ్బ ఖర్చవుతుంది. ఇటువంటి పరిస్థితిలో టీ20 సిరీస్ కోసం బారత్, ఇంగ్లాండ్ మధ్య ఏ జట్టుకు ఎక్కువ డబ్బు లభిస్తుందో చూద్దాం.
సంపన్న బోర్డు..
ఇంగ్లాండ్, వేల్‌స క్రికెట్ బోర్డు(ఉఇఆ) ప్రపంచంలో మూడో సంపన్న క్రికెట్ బోరుడ రూ.492 కోట్ల(సుమారు 59 బిలియన్ డాలర్లు) ఆస్తులు వీరికి ఉన్నాయి. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన ఆటగాళ్లకు అన్ని పార్మాట్‌లలో వేర్వేరుగా ఫీజులు చెల్లిస్తుంది. టీ20 మ్యాచ్‌ల గురించి మాట్లాడితే ఇంగ్లండ్‌లో ఒక్కో క్రికెటర్‌కు 4,500 పౌండ్లు(రూ.4.55 లక్షలు) ఇస్తారు.
ఇక ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు మనదే. బీసీసీఐ ఆస్తుల విలువ 2.25 బిలియన్ డాలర్లు(రూ.18,700 కోట్లు) టీమిండియా ఆటగాళ్లకు టీ20 మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే.. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో భారత క్రికెటర్ల వేతనం తక్కువ. టీ20 మ్యాచ్‌లకు భారత ఆటగాళ్లకు రూ.3.55 లక్షలు మాత్రమే ఇస్తారు.
ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి మ్యాచ్..
ఇదిలా ంటే.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంగ్లండ్‌కు జోస్ బట్లర్ సారథ్యం వహిస్తాడు. ప్రస్తుతం ఇరు జట్లు బెంగాల్‌లో ఉన్నాయి. బుధవారం ఉదయం ముంబై చేరుకుంటాయి. తర్వాత ్త మ్యాచ్ జనవరి 25న జరుగుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో, 28న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరుగుతుంది. నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 31న పూణెలో నిర్వహిస్తారు. చివరి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న జరుగుతుంది. అనిన మ్యాచ్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
వన్డే సిరీస్ కూడా..
ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ ఐదు టీ20లు ఆడుతాయి. తర్వాత వన్డే సిరీస్ కూడా ఉంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో, రెండో మ్యాచ్ కటక్‌లో, చివరి వన్డే అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జరుగుతాయి.