Rishabh Pant: రిషభ్ పంత్.. పడిలేనిన కెరటం. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సుదీర్ఘ కాలం చికిత్స తర్వాత కోలుకున్నాడు. తిరిగి టీమిండియాలోకి వాచ్చడు. కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు. టీ20లతోపాటు ఐపీఎల్‌లోనూ ఆడుతున్నాడు. అయితే ఇటీవలే ఐపీఎల్‌కు సంబంధించిన మధ్యంతర వేలం ముగిసింది. పంత్‌ను లఖన్‌పూర్ సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ.27 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అంతేకాదు ఆ జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా ధ్రువీకరించారు. ఈమేరకు కోల్‌కత్తాలో పంత్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. రిషబ్ మాట్లాడుతూ వేలంలో తనను పంజాబ్ కింగ్‌స కొనుగోలు చేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడని పేర్కొన్నాడు. విశ్లేషకులు మాత్రం మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ లేదా పంజాబ్ కింగ్స్‌లో ఏదో ఒకటి పంత్‌ను కొటాయని భావించారు. కానీ వేలంలో పంజాబ్ రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకుంది. కాసేపటికే పంత్‌ను లఖన్‌పూర్ దక్కించుకుంది.
అయ్యర్ కారణంగా..
వేలం రోజు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయాలని చూసింది. ఆమేరకు ఆ టీంవద్ద డబ్బులు కూడా ఉన్నాయి. అయినా పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ పంత్‌వైపు మొగ్గు చూపలేదు. కానీ, అయ్యర్‌ను పంజాబ్‌కొన్న కారణంగా తనను లఖన్‌పూర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. భారీ ధరకు దక్కించుకోవడంపై ఏమైనా టెన్షన్ పడ్డారా అని అడగగా, గోయెంకా ఆందోళన చెందనంతకాలం తనకు డోకా లేదని ప్రకటించారు.
ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవని పంజాబ్..
ఇదిలా ఉంటే.. పూర్వం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో ఒక ప్రముఖ క్రికెట్ జట్టు. ఈ జట్టు పంజాబ్ రాష్ట్రం ఆధారంగా ఉంది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్ లీగ్ లో చేరింది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో కొన్ని సమయాలలో బలమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు టోర్నమెంట్ విజేతగా నిలవలేదు.జట్టు పేరు కొన్ని సార్లు మారింది, మొదట ‘పంజాబ్ కింగ్స్ ఎలెవన్‘ గా ప్రారంభమైనా, తరువాత ‘పంజాబ్ కింగ్స్‘ గా మారింది. ఈ జట్టు లోని ప్రముఖ ఆటగాళ్లు క్రిస్ గేల్, యుూవరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర దక్షిణ ఆఫ్రికా ఆటగాళ్లతో మిళితమైన జట్టు. ఈ జట్టుకు బాలీవుడ్ నటి ప్రతీజింటా యజమానిగా ఉన్నారు.