India Vs Australia(4)
India Vs Australia: కొంతకాలంగా సిరాజ్ తనదైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తనదైన వేగంతో వికెట్లను పడగొట్టలేకపోతున్నాడు. తనదైన దూకుడు కొనసాగించలేకపోతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇది అతడికి నిరాశ కలిగిస్తోంది. నిర్వేదాన్ని కలిగిస్తోంది. ఇబ్బందిని కలిగిస్తోంది. ఆస్ట్రేలియా మైదానాలపై ఎంతగా బౌన్స్ రాబట్టడానికి.. పేస్ రాబట్టడానికి అతడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే.. సిరాజ్ వికెట్లను తీయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. వంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన అతడు మౌన ప్రేక్షకుడిగా చూస్తున్నాడు. ఇది అతడికే కాదు, జట్టు మేనేజ్మెంట్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. అతడి నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందని భావించి.. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోంది.
దుమ్ము రేపాడు
మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ గురువారం మొదలైంది. టీమిండియా భవితవ్యాన్ని నిర్దేశించే ఘనత ఈ టెస్ట్ సొంతం. అందువల్లే ఈ మ్యాచ్లో టీమిండియా మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి టీమిండియా కు అవకాశాలుంటాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదని చెబుతూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఈ టెస్ట్ ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ స్టాన్ 60 పరుగులు చేశాడు. బుమ్రా లాంటి బౌలర్ కు చుక్కలు చూపించాడు. అయితే సిరాజ్ మాత్రం తన నేపథ్యానికి భిన్నంగా బౌలింగ్ చేశాడు. పదునైన బంతులు వేస్తూ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు నరకం చూపించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ కు తన పేస్ ప్రతాపాన్ని రుచి చూపించాడు. వరుసగా పదునైన బంతులు వేసి క్రీజ్ నుంచి కదలకుండా చేశాడు. అతడి రక్తాన్ని కళ్ళ చూశాడు.. షార్ట్ పిచ్ లక్ష్యంగా బంతులు వేసిన సిరాజ్.. లబూషేన్ కు అక్కడ ఇబ్బంది కలిగేలా చేశాడు. వరుసబంతులు ఇలా ఎదురు కావడంతో లబూషేన్ కు చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా చివరి బంతి అయితే లబూషేన్ కంట్లో నుంచి నీరు తెప్పించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనం ఇస్తోంది. “సిరాజ్ మంచి టెంపో లో ఉన్నాడు. దూకుడుగా బౌలింగ్ చేస్తున్నాడు. ధాటిగా బంతులు వేస్తున్నాడు. అది ఎదుర్కోవడం ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ కు ఇబ్బందిగా మారింది. గతంలో ఆస్ట్రేలియా బౌలర్లు ఇదే విధంగా బౌలింగ్ చేసే వాళ్ళు. బ్యాటింగ్ చేయాలంటనే ప్రత్యర్థి ఆటగాళ్లకు భయం కలిగించేలా చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.