https://oktelugu.com/

Weather Report: హైదరాబాద్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అసలు ఎందుకిలా జరుగుతోంది?

ప్రస్తుతం వాతావరణంలో ఊహించిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వింటర్ లో వణుకు పుట్టే చలి ఉండాలి. కానీ పొడి వాతావరణం కనిపిస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2024 / 11:51 AM IST

    Hyderabad weather report

    Follow us on

    Weather Report: ప్రస్తుతం వాతావరణంలో ఊహించిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వింటర్ లో వణుకు పుట్టే చలి ఉండాలి. కానీ పొడి వాతావరణం కనిపిస్తోంది. అంతేకాకుండా బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయి. నిర్దిష్ట వాతావరణాన్ని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మేఘాలు, వర్షపాతం, తేమ, గాలి పరిస్థితిని ట్రోపోస్పియర్ లోని స్ట్రాటో ఆవరణ కింద జరుగుతాయి. అయితే వారం రోజుల పాటు వాతావరణం ఎలా ఉండనుంది? అనే వివరాల్లోకి వెళితే..

    2024 డిసెంబర్ 26న హైదరాబాద్ వాతావరణం చల్లబడింది. ఈరోజు 24.55 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్టంగా 20.17, గరిష్టంగా 26.46 సూచించింది. సాపేక్ష అర్థ్రత 71 శాతంగా ఉంది. గాలి వేగం గంటకు 71 కిలోమీటర్ల వేగం ఉంది. ఈరోజు సూర్యోదయం 6.43 ఉండగా.. సూర్యాస్తమం 5.49కి జరగనుంది. ఈరోజు చల్లటి వాతావరణం ఉండడంతో పాటు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. ఫ్లూ రావడానికి ఇది అనుకూల సమయం అయినందుకు బయటకు వెళ్లేటప్పుడు తల వరకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేవారు. హెల్మెట్ తో పాటు సన్ గ్లాసెస్ ను ఉంచుకోవాలి.

    డిసెంబర్ 27 శుక్రవారం కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపు కనిష్టంగా 20.22 సెంటి గ్రేడ్ నుంచి గరిష్టంగా 26.46 సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తేమస్థాయి 66 శాతంగా ఉండే అవకాశం ఉంది. అయితే శనివారం నుంచి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 28 (శనివారం) గరిష్టంగా 24.67, డిసెంబర్ 29 (ఆదివారం) 26.19 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అలాగే డిసెంబర్ 30న 26.17, డిసెంబర్ 31న 26.91 ఉండనుంది. కొత్త సంవత్సరం జనవరి 1న 27.32 ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

    గత రెండు మూడు రోజులగా చల్లబడ్డ వాతావరణం శనివారం నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. శీతాకాలం ప్రారంభమైన తరువాత కొన్ని రోజుల పాటు విపరీతమైన చలి విజృంభించింది. అయితే ఆ తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గత మూడు రోజుల నుంచి పొడి వాతావరణం ఉంటోంది. కానీ డిసెంబర్ 29 నుంచి జనవరి వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది.

    హైదరాబాద్ లోనే కాకుండా ఇతర నగరాల్లో గురువారం వాతావరణ పరిస్థితులు పరిశీలిస్తే.. ముంబైలో 24.7 సెంటిగ్రేడ్, కోల్ కతా25.23, చెన్నై 27.63, బెంగుళూరు 21.76, అహ్మదాబాద్ 24.82, ఢిల్లీ 20.97 సెంటిగ్రేడ్ నమోదైంది. ఓవరాల్ గా గరిష్టంగా బెంగుళూర్ లో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే అత్యధికంగా చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జనవరి నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.