Ind Vs Aus 4th Test: మెల్ బోర్న్ టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 32.3 ఓవర్ వద్ద స్టీవెన్ స్మిత్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 80 పరుగులు. మరో ఐదు పరుగులు (85) జోడించిన తర్వాత 33.2 ఓవర్ వద్ద హెడ్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. అంతే పరుగుల వద్ద మార్ష్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. అప్పటికి ఆస్ట్రేలియా 33.6 ఓవర్లు ఆడింది. 35.6 ఓవర్ వద్ద ఆస్ట్రేలియా స్కోర్ 91 పరుగులకు చేరుకున్నప్పుడు.. అలెక్స్ క్యారీ ఆరో వికెట్ గా వెను తిరిగాడు. ఇక ఇక్కడ లబూషేన్, కమిన్స్ జత అయ్యారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 57 పరుగులు జోడించారు. 55.1 ఓవర్ వద్ద ఆస్ట్రేలియా స్కోర్ 148 పరుగులకు చేరుకుంది. అక్కడ లబూ షేన్ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 156 పరుగుల వద్ద చేరుకున్నప్పుడు స్టార్క్ వెనుతిరిగాడు. అప్పటికి ఆస్ట్రేలియా 58.1 ఓవర్లు ఆడింది.. జట్టు స్కోరు 173 పరుగులకు చేరుకున్నప్పుడు కమిన్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లయన్, బోలాండ్ పదో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 64.1 ఓవర్ నుంచి మొదలు పెడితే 83.4 ఓవర్ల వరకు వీరిద్దరే ఆడారు. ఆల్మోస్ట్ 129 బంతులు వీరిద్దరే ఎదుర్కొన్నారు.
ఇండియాకు వచ్చేసరికి..
ఆస్ట్రేలియా విధించిన 340 స్కోర్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన టీమిండియా ఒక నాలుగో వికెట్ కు నమోదైన భాగస్వామ్యం మినహాయిస్తే .. ఎక్కడ కూడా పోరాడినట్టు కనిపించలేదు. 16.1 ఓవర్ వద్ద 25 పరుగులకు జట్టు స్కోర్ చేరుకున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అదే స్కోరు వద్ద 16.6 ఓవర్ లో రాహుల్ పెవిలియన్ చేరుకున్నాడు. ఇది ఒక రకంగా టీమ్ ఇండియాకు ఒకే ఓవర్ లో డబుల్ స్ట్రోక్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. ఇప్పటికీ టీమ్ ఇండియా 26.1 ఓవర్లు ఆడింది. ఈ దశలో వచ్చిన రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 88 పరుగులు నాలుగో వికెట్ కు జోడించారు. నాలుగో వికెట్ రూపంలో రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత.. మిగతా ఆర్ వికెట్లు టీమ్ ఇండియా అత్యంత దారుణంగా కోల్పోయింది. ఆస్ట్రేలియా ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎంత నేర్పుగా ఆడిందో… అదే స్థితిలో టీమిండియా ఉన్నప్పుడు అత్యంత చెత్తగా ఆడింది. 121 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. 127 పరుగుల వద్ద రవీంద్ర జడేజా రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 130 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి, 140 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, 150 పరుగుల వద్ద ఆకాష్ దీప్, 154 పరుగుల వద్ద బుమ్రా, 155 పరుగుల వద్ద సిరాజ్ వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. మిగతా 6 వికెట్లను కేవలం 34 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం. ఇంత దరిద్రంగా ఆడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన ఓటమి కాకుండా.. మరే ఓటమి లభిస్తుందని అభిమానులు టీమిండియా మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు.