ODI World Cup 2023: భారత్ వేదికగా ఈ సంవత్సరం చివరిలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ పై క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరోపక్క ఇండియన్ టీం కూడా ఈ వరల్డ్ కప్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లుగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ కైవసం చేసుకుంటేనే కదా కిక్ ఉండేది. ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ మ్యాచ్లో భారత్ తరఫున తీసుకోబోయే టీం ఆటగాళ్లపై ఇప్పటికే పలు రకాల చర్చలు మొదలయ్యాయి.
ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలలో ఇండియన్ జట్టు విజయ ఢంకా మోగించి ఇప్పటికే సుమారు పది సంవత్సరాలు కావస్తోంది. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో గెలిచిన భారత జట్టు తిరిగి ఇప్పటివరకు మరి ఎటువంటి మేజర్ టోర్నమెంట్లో రాణించలేదు. ఈ నేపథ్యంలో రాబోయే వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే జరుగుతున్న గత కొద్ది మ్యాచ్లను పరిశీలిస్తే భారత్ ఆటగాళ్ల ఆట తీరుపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఉదాహరణకి మొన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండవ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ ఎలా తడబడిందో అందరూ చూశారు. కేవలం ఒకరిద్దరి ప్లేయర్లపై భరోసా పెట్టి మ్యాచ్ ఆడడం కరెక్ట్ కాదు అన్న వాదనలు వెల్లువెత్తాయి. టీం ఎంపికపై బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులే కాదు మాజీ స్టార్ క్రికెటర్లు కూడా పలు సందర్భాలలో తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వీటన్నిటి మధ్య బీసీసీఐ సెలక్షన్ కమిటీ జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టీం ను ప్రకటించడం జరిగింది.
ఇందులో చాలామంది యువ క్రికెటర్లను పక్కన పెట్టడంపై పలు రకాల అభ్యంతరాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా అనుభవం ప్రాతిపదికన ఉన్న ప్లేయర్స్ ను మాత్రమే టీంకు ఎంపిక చేయడం జరిగిందని కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. మరి గాయపడిన రిషబ్ పంత్ ను ఏ బేసిస్ మీద జట్టులోకి తీసుకున్నారు అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో మొత్తం భారత్ తరఫున 20 మంది ఆటగాళ్లు తో కూడిన జట్టును ప్రకటించడం జరిగింది. ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ లిస్టులో కామన్ గా ఉన్న పేర్లు. ఇక బాటర్స్ శుభ్ మన్ గిల్,శ్రేయాస్ అయ్యర్ , సూర్య కుమార్ యాదవ్ కు ఈ జట్టులో స్థానం దక్కింది.ఇక వికెట్ కీపర్స్ సెక్షన్ లో సంజూ శాంసన్ , రిషబ్ పంత్ , ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయ్యారు. వీళ్లతో పాటు ఆల్రౌండర్స్ అయినా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
ఇంతకుముందు బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ చెప్పినట్లుగానే రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కు బౌలర్గా జట్టులో స్థానం దక్కింది.
కుల్దీప్ యాదవ్ , బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , అర్ష్ దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ ను బౌలింగ్ కి ఎంపిక చేశారు. ప్లేయర్ల లిస్టు విడుదలైన తరువాత తిరిగి బీసీసీఐ సెలక్షన్ విధివిధానాలపై మరొకసారి సోషల్ మీడియాలో అభిమానులు మండి పడుతున్నారు.
చాలా రోజుల నిరీక్షణ తర్వాత వన్డేలో ఆడే అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగపరచుకోకుండా పేలవమైన పర్ఫామెన్స్ కనబరిచిన కేరళ బెటర్ సంజూ శాంసన్ కు అవకాశం దక్కడంపై కొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండే మరియు అతని ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తి ఫిట్నెస్ తో తిరిగి వచ్చినప్పటికీ ఇంకా అతను పూర్తిగా తన మునుపటి మార్కును చేరుకోలేదు. పర్ఫామెన్స్ లో నిలకడ లేని ఇలాంటి ప్లేయర్స్ బదులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యశ్విన్ జైస్వాల్,రుతురాజ్ గైక్వాడ్ , రింకూ సింగ్ , తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లను తీసుకోవడం వల్ల మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా మారుతుంది. ఇలా చేస్తే కప్ గెలిచే ఆస్కారం ఎక్కువ ఉంటుందేమో…