Ramachandra Yadav: బీజేపీ యాదవ కులాన్ని టచ్ చేస్తోందా? అందుకే ఆయన్ని చేరదీశారా?

ఇటీవలే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యోజన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆయన వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : August 2, 2023 1:13 pm

Ramachandra Yadav

Follow us on

Ramachandra Yadav: కులాల ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాల ను చర్చించే పరిస్థితి లేదు.అటు తెలంగాణలోనూ కూడా అదే పరిస్థితి.రెండు రాష్ట్రాల్లో చాలా కులాలు ఉన్నాయి.కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా రాజకీయాలను శాసిస్తున్నాయి. కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి సీఎం పదవిని కొలమానంగా భావించవచ్చు. ఆ పదవి కోసమే ప్రధాన పోటీ జరుగుతుంది కాబట్టి ఈ పోలిక సరైనదే.అయితే ఏపీ సమాజంలో ఆరేడు శాతం ఉన్న కులాలు రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాయి. 20 శాతం కంటే మించి ఉన్న కాపు సామాజిక వర్గం ఇంతవరకు రాజ్యాధికారం దక్కించుకోకపోవడం విశేషం.

ప్రస్తుతం ఏపీలో మూడు పార్టీలకు మూడు సామాజిక వర్గాలు బలమైన మద్దతుదారులుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, వైయస్సార్సీపీకి రెడ్డి, జనసేనకు కాపు సామాజిక వర్గం మద్దతు దారులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ను మార్చుకుంది. యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలోని వెనుకబడిన కులాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే రామచంద్ర యాదవ్ ను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యోజన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆయన వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా అమిత్ షా అపాయింట్మెంట్ ఇట్టే లభించింది.పార్టీని స్థాపించిన తర్వాత.. నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు చేశారు. 20 నిమిషాల పాటు అమిత్ షా రామచంద్ర యాదవ్ కు సమయం ఇచ్చారు. అంటే రామచంద్ర యాదవ్ వెనుక బిజెపి ఉన్నట్లు ప్రచారంజరుగుతోంది. రామచంద్ర యాదవ్ ద్వారా యాదవ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లువిశ్లేషణలు వెలువడుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం విస్తరించి ఉంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన రామచంద్ర యాదవ్ కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవ సామాజిక వర్గంలో ఫాలోయింగ్ అధికం. అందుకే ఆయన సొంత పార్టీని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గాన్నిఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో యాదవులు గెలుపోటములు నిర్దేశించే స్థాయిలో ఉన్నారు.అందుకే భారతీయ జనతా పార్టీ రామచంద్ర యాదవ్ కు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.