India Cricket Golden Era Analysis: క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ఒకప్పుడు కొనసాగింది. ఆ జట్టు వరుసగా వన్డే వరల్డ్ కప్ లు గెలిచేది. ద్వైపాక్షిక, త్రైపాక్షిక, మేజర్ టోర్నీలలో ఘనవిజయం సాధించేది. వెస్టిండీస్ నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అప్పర్ హ్యాండ్ కొనసాగించేది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్థానాన్ని టీమిండియా ఆక్రమించినట్లు కనిపిస్తోంది.
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
టీమిండియాకు 2024, 2025, 2026 గోల్డెన్ ఏరాలుగా మారినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2024లో టీమిండియా రోహిత్ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 తర్వాత అంటే దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ నిరక్షణ అనంతరం టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. 2025 లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఓడించి ట్రోఫీని అందుకుంది.
2025లో పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా సత్తా చాటారు. మహిళా వరల్డ్ కప్ లో టీమిండియా సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే తొలి వన్డే వరల్డ్ కప్. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించి సత్తా చూపించింది. పురుషులు.. మహిళలు సాధించిన ఘనతలు అద్భుతంగా ఉంటే.. యంగ్ ప్లేయర్లు కూడా అదే స్థాయిలో అద్భుతాన్ని సృష్టించారు. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా ప్లేయర్లు సొంతం చేసుకున్నారు.
ఒకప్పుడు క్రికెట్ మీద ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తే.. ఇప్పుడు ఆస్థానాన్ని టీమిండియా భర్తీ చేసే విధంగా కనిపిస్తోంది. వరుసగా రెండు టి20 వరల్డ్ కప్ లు టీమిండియా గెలిచింది. ఈ ఘనత సాధించిన జట్టుగా టీమిండియా ఆవిర్భవించింది.. టీమిండియా పొట్టి ఫార్మాట్లో సత్తా చూపిస్తున్న నేపథ్యంలో.. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఇదే స్థాయిలో సత్తా చూపించి విజేతగా నిలవాలని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో విన్నర్ గా ఆవిర్భవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.