https://oktelugu.com/

India Vs England 1st Test: 436 పరుగులకు అలౌట్ అయిన ఇండియా…ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇదే ఒక్కటే దారి…

మొదటి ఇన్నింగ్స్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్స్ చాలా వరకు సూపర్ గా ఆడి ఇండియన్ టీమ్ కి భారీ స్కోర్ అందించడం లో సక్సెస్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ టీం 196 పరుగుల ఆధిక్యం లో ఉంది.

Written By: , Updated On : January 27, 2024 / 11:53 AM IST
India Vs England 1st Test
Follow us on

India Vs England 1st Test: ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 436 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఇక అందులో భాగంగానే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.ఇక మూడో రోజు ఆరంభంలోనే 15 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.దాంతో ఇండియన్ టీమ్ 436 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక ఇండియన్ టీమ్ బ్యాట్స్ మెన్ లలో రవీంద్ర జడేజా 87, రాహుల్ 86, జైశ్వాల్ 80,అక్షర్ పటేల్ 44, భరత్ 41 పరుగులు చేశారు.ఇక ఇంగ్లాండ్ బౌలర్లో జో రూట్ 4, టామ్ 2, రెహన్ అహ్మద్ 2, జాన్ లీచ్ ఒక వికెట్ తీశారు…

ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్స్ చాలా వరకు సూపర్ గా ఆడి ఇండియన్ టీమ్ కి భారీ స్కోర్ అందించడం లో సక్సెస్ అయ్యారు.
ఇక ఇదిలా ఉంటే ఇండియన్ టీం 196 పరుగుల ఆధిక్యం లో ఉంది. ఇక ఇదే ఊపు లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ని తొందర గా అవుట్ చేసినట్లయితే ఇండియా ఈ మ్యాచ్ లో ఈజీగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఇండియాకి ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. కాబట్టి ఇంగ్లాండ్ ని ఎంత తొందరగా కట్టడి చేస్తే అంత మంచిదని ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు మన స్పిన్నర్లు మళ్ళీ ఒకసారి విజృంభిస్తే తప్ప ఈ మ్యాచ్ మన చేతిలోకి రాదనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.

ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఐదు మ్యాచ్ లా సిరీస్ లో ఇండియా 1-0 తో ప్రస్తుతానికి ఆధిక్యం లో ఉంటుంది. ఇక నాలుగు మ్యాచ్ ల్లో ఇంకో 2 మ్యాచ్ లు గెలిస్తే సిరీస్ మనకే సొంతం అవుతుంది. అలాగే డబ్ల్యూటిసి మ్యాచ్ లకి కూడా అర్హత సాధించడం సులభం అవుతుంది….