Pushpa 2 Vs Devara: సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి కొంతమంది హీరోల మధ్య మంచి పోటీ నడుస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల మధ్య పోటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇప్పటికే అనిమల్, సలార్ సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయి మంచి విజయాలను అందుకున్నాయి.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ కి భారీ పోటీ ఎదురవుతుంది. దేవర సినిమాతో ఎన్టీయార్ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఆగస్టు 15 న మనందరిని పలకరించబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల రిలీజ్ ల మధ్య భారీ డిస్టెన్స్ ఉన్నప్పటికీ ఇందులో ఏ సినిమా భారీ విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎన్టీయార్ మార్కెట్ ని అల్లు అర్జున్ డామినేట్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన ఫాలోయింగ్ మొత్తాన్ని అల్లు అర్జున్ లాగేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందో ఆ హీరో మార్కెట్ భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది.
ఒకవేళ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా అందులో ఏ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే దాని మీద హీరోల మార్కెట్ అనేది ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఎన్టీఆర్ తనని తాను మరోసారి మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో కూడా అదే చేయాలని చూస్తున్నాడు.
మరి ఇద్దరు హీరోలలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎన్టీఆర్ 2018 వ సంవత్సరంలో అరవింద సమేత సినిమాతో సోలో హీరోగా వచ్చాడు. ఇక ఆ తరువాత త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించాడు. ఆ సినిమా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు తను సోలో హీరోగా వస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ ను భారీగా పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇక అల్లు అర్జున్, ఎన్టీయార్ మధ్య జరిగే పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…