Homeక్రీడలుక్రికెట్‌Ind Vs South Africa Warm Up Match: ఇషాన్ కిషన్ దూకుడు ముందు అభిషేక్...

Ind Vs South Africa Warm Up Match: ఇషాన్ కిషన్ దూకుడు ముందు అభిషేక్ శర్మ తల వంచాడు.. ఇది ఊహించలేదు భయ్యా!

Ind Vs South Africa Warm Up Match: ఏ ముహూర్తంలో అయితే న్యూజిలాండ్ సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చాడో తెలియదు గాని.. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వేదిక ఏదైనా సరే.. ప్రత్యర్థి ఎవరైనా సరే పరుగుల వరద పారిస్తున్నాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను పంపిస్తున్నాడు. టీమిండియాలో అత్యంత వేగంగా ఆడే ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం అభిషేక్ శర్మ అని చాలా మంది […]

Ind Vs South Africa Warm Up Match: ఏ ముహూర్తంలో అయితే న్యూజిలాండ్ సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చాడో తెలియదు గాని.. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వేదిక ఏదైనా సరే.. ప్రత్యర్థి ఎవరైనా సరే పరుగుల వరద పారిస్తున్నాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను పంపిస్తున్నాడు.

టీమిండియాలో అత్యంత వేగంగా ఆడే ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం అభిషేక్ శర్మ అని చాలా మంది చెబుతారు. చూస్తుండగానే విధ్వంసాలను సృష్టించడం.. పరుగుల వరద పారించడం.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం వంటివి అభిషేక్ శర్మకు అలవాటు. అభిషేక్ శర్మ ఇటీవల కాలంలో అత్యంత భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మాత్రమే అతడు విఫలమైనప్పటికీ.. మిగతా అన్ని సమయాలలో అతడు జట్టు భారాన్ని మొత్తం మోసాడు. భారీ స్కోరు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేయడం అతనికి మాత్రమే సాధ్యం.

అటువంటి అభిషేక్ శర్మను కూడా బీట్ చేశాడు ఇషాన్ కిషన్. టి20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో సత్తా చూపించాడు. 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు రెండు ఫోర్లు మాత్రమే కొట్టి.. ఏకంగా ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా 265 స్ట్రైక్ రేట్ తో 53 పరుగులు చేశాడు. ఒకానొక సందర్భంలో 17 బంతులకే కిషన్ 47 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ 13 బంతులకు కేవలం 22 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ దూకుడుకు 13 బంతుల్లో ఆమాత్రం పరుగులు అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మను సైతం బీట్ చేశాడు. టి20 వరల్డ్ కప్ ముందు తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు.

ఇషాన్ కిషన్ మాత్రమే కాదు, ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 45, సూర్య కుమార్ యాదవ్ 30, అక్షర్ పటేల్ 35 పరుగులు చేశారు. టి20 వరల్డ్ కప్ ముందు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. వీరందరిలో కన్నా ఇషాన్ కిషన్ చేసిన పరుగులే వార్మప్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper