Ind W Vs Aus W Semi Final 2025 Highlights: ఆస్ట్రేలియా జట్టు విధించిన 339 పరుగుల టార్గెట్ ను టీమిండియా అత్యంత విజయవంతంగా ఫినిష్ చేసింది. ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. తద్వారా దర్జాగా ఫైనల్ లోకి ప్రవేశించింది.. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా జట్టుతో అమీ తుమీ తేల్చుకొనుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు మీద 339 పరుగుల టార్గెట్ ఫినిష్ చేయడం అంటే అంత ఈజీ కాదు. జెమీమా రోడ్రిగ్స్ వీరొచిత సెంచరీ వల్ల టీమిండి అద్భుతమైన గెలుపును అందుకుంది. ఆస్ట్రేలియాపై సాధించిన ఘనవిజయం ద్వారా అనేక ప్రపంచ రికార్డులను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
మహిళ వన్డే వరల్డ్ కప్ లో అత్యధికంగా సిక్సర్లు నమోదైన మ్యాచ్ గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో రెండు జట్ల సంబంధించిన ప్లేయర్లు ఏకంగా 14 సిక్సర్లు కొట్టారు. ఇందులో భారత్ తరఫున ఐదు నమోదు కాగా.. ఆస్ట్రేలియా తరఫున తొమ్మిది నమోదయ్యాయి. వరల్డ్ కప్ లో నాకౌట్ దశలో 300+ కంటే ఎక్కువ పరుగులను చేధించడం ఇదే తొలిసారి. పురుషులు, మహిళల క్రికెట్లో కూడా ఇదే ప్రథమం..
మహిళల ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య చేదన (339) ఇదే. దీనిని భారత జట్టు ఆస్ట్రేలియా మీద సాధించింది. ఈ రికార్డును ఇటీవల ఆస్ట్రేలియా మన మీద సాధించింది. ఇదే వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ (331) పరుగుల లక్ష్యాన్ని చేధించింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, భారత జట్టు కలిసి ఏకంగా 679 పరుగులు చేయడం విశేషం. 2017లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 678 పరుగులు నమోదు అయ్యాయి.
అంతర్జాతీయ టోర్నీలలో..
అంతర్జాతీయ టోర్నీల ప్రకారం చూసుకుంటే.. ఈ ఏడాది ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. రెండు జట్లు 781 పరుగులు చేశాయి.. ఇక ఈ వరల్డ్ కప్ లో ముంబై వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా తలపడగా.. రెండు జట్లు 679 పరుగులు చేశాయి. 2017 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో 678 పరుగులు నమోదు అయ్యాయి. 2025 వరల్డ్ కప్ లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇండియా, ఆస్ట్రేలియా 661 పరుగులు చేశాయి. కొలంబో వేదికగా 2025 లో జరిగిన మ్యాచ్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు 651 పరుగులు చేశాయి. 2022 ఫైనల్ మ్యాచ్లో నాట్ స్కీవర్ బ్రెంట్(148*) తర్వాత జెమీమా రోడ్రిగ్స్(127*) అత్యుత్తమమైన ఇన్నింగ్స్ ఆడింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబ్లీచీ ఫోల్డ్ ఈ మ్యాచ్లో శతకం చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్లో అది కూడా నాకౌట్ పోటీలో సెంచరీ చేసిన అతి చిన్న వయసున్న (22 సంవత్సరాలు) ప్లేయర్ గా ఫీల్డ్ నిలిచింది. 2022 నుంచి 2025 వరకు ఆస్ట్రేలియా జట్టు 15 వన్డేలు ఆడితే.. ఒక దాంట్లో కూడా ఓటమి పొందలేదు. ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్ లో ఓడించి నేలకు దించింది టీమిండియా. వన్డేలలో ఆస్ట్రేలియా 1997-2000(15), 1978-1982(12), న్యూజిలాండ్ 1988-1993(11), ఇంగ్లాండ్ 1993-1997(10) జట్లు వరుస విజయాలు సాధించాయి. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ ఫైనల్ వెళ్లడం ఇది మూడవసారి. 2005, 2017లో రన్నరప్ గా నిలిచారు భారత మహిళలు. మహిళల బండ ప్రపంచకప్ లో భారత్ గతంలో ఎన్నడు కూడా 200+ పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధించలేదు. ఆస్ట్రేలియా మీద సాధించిన 341/5 వన్డేలలో టీమిండియా కు సెకండ్ హైయెస్ట్ స్కోర్. గత నెలలో భారత్ ఆస్ట్రేలియా మీద ఢిల్లీ వేదికగా 369 పరుగులు చేసింది. టీమ్ ఇండియాకు వన్డేలలో ఇదే హైయెస్ట్ స్కోర్.