Nara Rohit Wedding: ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్(Nara Rohit) పెళ్లి నిన్న శిరీష తో హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహాన్ని ఆయన కుటుంబ సభ్యులు,మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్ష్యం లో గ్రాండ్ గా జరుపుకున్నాడు. సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు కూడా వచ్చారు కానీ, కేవలం నారా రోహిత్ కి బాగా సన్నిహితంగా ఉండే శ్రీవిష్ణు, మంచు మనోజ్ వంటి వారు మాత్రమే వచ్చారు. వీళ్లిద్దరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ లో జరిగింది. అలా నిశ్చితార్థం జరిగిన ఏడాదికి వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి చంద్రబాబు మరియు ఆయన కుటుంబ సభ్యులతో పాటు, నందమూరి బాలకృష్ణ వంటి వారు కూడా హాజరు అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ పెళ్ళికి దూరం గా ఉన్నాడు. అసలు నారా రోహిత్ ఆయన్ని ఆహ్వానించాడా?, ఒకవేళ ఆహ్వానించినా ఎన్టీఆర్ రాలేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
రీసెంట్ గానే ఎన్టీఆర్ తన భార్య సోదరుడు నార్నె నితిన్ పెళ్లి వేడుకలో కుటుంబ సమేతంగా విచ్చేసి ఎంత సందడి చేసాడో మనమంతా చూసాము. ఒక్క మాట లో చెప్పాలంటే పెళ్లి ఆయనే దగ్గరుండి చేసినట్టుగా అనిపించింది. ఆ పెళ్లి కి నారా కుటుంబం కానీ, లేదా నందమూరి కుటుంబం కానీ రాలేదు. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే వచ్చారు. ఇప్పుడు నారా రోహిత్ పెళ్ళికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప మిగిలిన అందరూ వచ్చారు, ఎక్కడో ఎదో తేడా కచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్నీ ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే శిరీష కూడా టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. నారా రోహిత్ తో కలిసి ఆమె ‘ప్రతినిధి 2’ లో నటించింది. అదే విధంగా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో కూడా నటించింది ఈమె. కానీ ఎడిటింగ్ లో ఆమె సన్నివేశాలను తొలగించినట్టు ఉన్నారు. చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తున్న శిరీష నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో చాలా మందికంటే బెటర్ అని అనిపిస్తుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ చేస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకోవచ్చు.