IND VS SL : శ్రీలంకలో ఆరు మ్యాచ్ ల టోర్నీకి వెళ్లనున్న భారత జట్టు ఇదే.. ప్లేయింగ్-11 ఎలా ఉండబోతోంది? ఎవరెవరు ఓపెనింగ్ కు దిగబోతున్నారు?

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు జూన్ లోనే టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్, కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేయగా కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో ఇప్పుడు ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ప్రశ్న. అయితే, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ చేస్తారని తెలుస్తోంది

Written By: NARESH, Updated On : July 25, 2024 6:02 pm

Team India Unsung Heroes

Follow us on

IND VS SL :  బ్రడ్జిటౌన్ లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా మంచి ఫామ్ మీద ఉంది. ఈ వరల్డ్ కప్ నుంచే ముగ్గురు సీనియర్లు రోహిత్, విరాట్, రవీంద్ర జడెజా టీ20కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరు లేకున్నా యంగ్ ప్లేయర్స్ తో టీమిండియా పటిష్టంగానే ఉంది. వరుస విజయాలతో వరల్డ్ వైడ్ మంచి పర్మార్మెన్స్ తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా శ్రీలంక పర్యటన చేయబోతోంది. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు తొలి టీ20లో పాల్గొంటుంది. ఇరు జట్లు మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేల ఆడాలి. జులై 27 (శనివారం)న టీమిండియా ఈ సిరీస్ లో పాల్గొనేందుకు వెళ్లబోతోంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లు అన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ‘పల్లెకెలె’లో జరుగుతాయి. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించింది. గౌతమ్ గంభీర్ కూడా ఈ మ్యాచ్ తోనే కోచ్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ప్రధాన కోచ్ గా గంభీర్ కు ఇదే తొలి పర్యటన, తొలి సిరీస్ ఇదే.

టీ20ల్లో గిల్, యశస్వి ఓపెనింగ్
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు జూన్ లోనే టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్, కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేయగా కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో ఇప్పుడు ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ప్రశ్న. అయితే, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ చేస్తారని తెలుస్తోంది. వీరిద్దరూ జింబాబ్వే పర్యటనలో చివరి 3 మ్యాచ్ ల్లో ఓపెనింగ్ కు దిగారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో గిల్, యశస్వి ఓపెనింగ్ లో అధిక స్కోర్ సాధించే అవకాశం ఉంది.

బౌలింగ్ ఈ కాంబోలో ఉండొచ్చు
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ మూడో స్థానంలో రావడం దాదాపు ఖాయమైంది. అప్పుడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్వయంగా నెం. 4 స్థానంలో వస్తాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే వరుసగా 5, 6, 7 స్థానాల్లో దిగే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలింగ్ లో అర్దీప్ సింగ్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. మూడో పేసర్ గా ఆల్ రౌండర్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు.

ఆలౌరండర్ అక్షర్ పటేల్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్పిన్నర్ గా తమ బౌలింగ్ ను చూపించగలరు. బిష్ణోయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం దక్కేలా కనిపిస్తుంది. ‘పల్లెకెలె’ పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటే కెప్టెన్ సూర్య మూడో స్పిన్నర్ గా వాషింగ్టన్ తో పాటు అక్షర్, బిష్ణోయ్ ను కూడా ఈ మైదానంలో ఆడించవచ్చు. అప్పుడు రింకు సింగ్ లేదా శివమ్ దూబే ఔటయ్యే అవకాశం ఉంది.

భారత్ – శ్రీలంక వన్డే సిరీస్
టీ20 సిరీస్ తర్వాత భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ఆగస్ట్ 2 (శుక్రవారం)న జరగనుంది. ఈ సిరీస్ లోని అన్ని వన్డేలు శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ 50-50 ఓవర్ల వన్డేలు జరగనున్నాయి.

శ్రీలంక పర్యటనకు భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

భారత్-శ్రీలంక టోర్నీ షెడ్యూల్
జూలై 27 – శనివారం- తొలి టీ20-పల్లెకెలె
జూలై 28 – ఆదివారం- రెండో టీ20-పల్లెకెలె
జూలై 30 – మంగళవారం- మూడో టీ20-పల్లెకెలె
ఆగస్ట్ 02 – శుక్రవారం- మొదటి వన్డే-కొలంబో
ఆగస్ట్ 04 – ఆదివారం- రెండో వన్డే-కొలంబో
ఆగస్ట్ 07 – బుధవారం- మూడో వన్డే-కొలంబో