Telangana Assembly Budget 2024:తెలంగాణలో రాబోయే 8 నెలల కాలాని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024–25 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.20 లక్షల కోట్లు కాగా, మూల ధన వ్యయం 33,487 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధి రేటు 7.4గా అంచనా వేశారు. గత ప్రభుత్వం పనితీరు కారణంగా రాష్ట్ర అప్పులు రూ.6.71,756 కోట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క చేసిన అప్పులు రూ.35,118 కోట్లు అని పేర్కొన్నారు. ఇక బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యం దక్కింది. వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,659 కోట్లు కేటాయించారు. తర్వాత సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. తర్వాత నీటిపారుదల రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. హోం శాఖకు కూడా రూ.9,564 కోట్లు కేటాయించారు. ఈ నిధులను శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, అక్రమ దందాల నింయత్రణ, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. నేర రహిత తెలంగాణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా డగ్స్ర్‌పై రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. మహిళల రక్షణకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సినీ పరిశ్రమకు కూడా కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో దీనికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు హోం శాఖకు రూ.9,564 కోట్లు కేటాయించారు.
యువతను కాపాడేందుకు..
మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దనికి బానిసైతే దేశ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ రవాణా, వినియోగం పై నిఘా పెట్టింది. ఈమేరకు పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో తెలంగాణలో మాదకద్రవ్య నిరోధక సంస్థక తగిన సౌకర్యాలు కల్పించి బలోపేతం చేశారు. విద్యా సంస్థల్లో వీటి కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. 4.137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా నియమించారు. మాదక ద్రవ్యాలతో కలిగే హానిపై ప్రజల్లో అవగామన కల్పించేందుకు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నారు. వీటకి సంబంధించిన కేసుల పరిస్కారానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్రఫ్టంగా తీర్చిదిద్దబమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
సైబర్‌నేరాల కోసం..
ఇక తెలంగాణలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటి నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. అభద్రతా వాతావరణంలో పెటుట్బడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవన్నారు. ఈ మధ్య వైట్‌కాలర్ సైబర్ నేరాలు పోలీస్ వ్యవస్థకు సవాల్‌గా మారిందని తెలిపారు. ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులకు ఆధునిక నేర పరిశోధనలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైం ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేసేలా వైబ్‌సైట్, టోల్‌ప్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సైబర్ చట్టాలపై పోలీసులక అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు.